వరసగా ఐదో సిరీస్ కూడా వారి ఖాతాలోనే.. కోహ్లీనే అసీస్ టార్గెట్ Australia will come hard at Virat Kohli in first Test: Sourav Ganguly

Australia will come hard at virat kohli in first test sourav ganguly

india vs australia, team indai, australia tour of india 2017, virat kohli, Sourav Ganguly, india, australia, cricket

Sourav Ganguly says that the Australians would make it tough for Virat Kohli, but believes that India has the capability to finish the series 4-0 in their favour.

వరసగా ఐదో సిరీస్ కూడా వారి ఖాతాలోనే.. కోహ్లీనే అసీస్ టార్గెట్

Posted: 02/18/2017 07:23 PM IST
Australia will come hard at virat kohli in first test sourav ganguly

ఇప్పటికే వరుసగా నాలుగు సిరీస్ లను తమ ఖాతాలోకి వేసుకున్న జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు చూసుకుపోతున్న తరుణంలో ఐదో సిరీస్ అడేందుకు భారత్ పర్యటనకు వచ్చిన అస్ట్రేలియాను కూడా త్వరలో చిత్తు చేసి విరాట్ సేన క్లీస్ స్వీమ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీమిండిమా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందన్నాడు. ఇది కచ్చితంగా విరాట్ కోహ్లి కెప్టెన్సీకి  పరీక్ష అని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ తో  స్వదేశంలో జరిగే ఈ సిరీస్ విరాట్ భవిష్యత్తను మార్చే సిరీస్ గా గంగూలీ అభివర్ణించాడు. పుణెలో 23వ తేదీన ఆరంభమయ్యే  తొలి టెస్టు నుంచే విరాట్ కోహ్లి టార్గెట్ గా ఆసీస్ ప్రణాళికలు సిద్దం చేయడం ఖాయమన్నాడు.

'గత ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ ను ఆసీస్ టార్గెట్ చేసినట్లే, ఈ సిరీస్ లో కూడా అతనే లక్ష్యంగా ఆ జట్టు ఛాలెంజ్ కు సిద్ధమవడం ఖాయం. ఈ సిరీస్ విరాట్  లైఫ్ ఛేంజిగ్ సిరీస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. విరాట్ అసాధారణ ఆటగాడిగా రూపాంతరం చెందిన నాటి నుంచి చూస్తే ఇది అతనికి కఠినమైన సిరీస్. తొలి టెస్టు నుంచి ఆసీస్ దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా విరాట్ కోహ్లినే టార్గెట్ చేస్తూ వారు చెలరేగిపోయే అవకాశం ఉంది. ఆసీస్ కూడా బలమైన జట్ట్టే కావడంతో రసవత్తర పోరు ఖాయం. కాకపోతే భారత్ పై ఆసీస్ విజయం సాధించడం మాత్రం అంత ఈజీ కాదు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు చాలా చాలా బాగా ఆడితేనే భారత్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది 'అని గంగూలీ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles