ధోని, కోహ్లీలపై అనీల్ కుంబ్లే ప్రశంసలు Anil Kumble in awe of 'passionate' Virat Kohli

Anil kumble in awe of passionate virat kohli

india vs australia, team india, australia, Anil Kumble, Virat Kohli, MS Dhoni, bcci, bcci news, cricket news, sports news, cricket

India coach Anil Kumble also lauded "perfect ambassador for the sport" MS Dhoni for the way he conducted himself as a captain of the team for 10 years.

ధోని, కోహ్లీలపై అనీల్ కుంబ్లే ప్రశంసలు

Posted: 02/17/2017 08:05 PM IST
Anil kumble in awe of passionate virat kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మాజీ కెప్టెన్లపై ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ కు అచ్చమైన బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ దోని అయితే.. ఒక్క మాటలో చెప్పలేని బ్రిలియనట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అన్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి టీమిండియాలో స్థానం సంపాదించడమే కాకుండా ఏకంగా దశాబ్ధకాలం పాటు జట్టుకు సారధిగా కొనసాగడం సాధారణ విషయం కాదని ధోనిని ఉద్దేశించి అన్నాడు. క్రికెట్ కు అచ్చమైన అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినేనని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఇక జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతనిలో కష్టపడేతత్వాన్ని తాను ఏనాడో చూశానని, అదే ఈ రోజు అతన్ని సారథిగా నిలబెట్టిందని కొనియాడాడు. విరాట్ కోహ్లి యువకుడిగా ఉన్న సమయంలోని అతనిలో పట్టుదల చూసినట్లు కుంబ్లే పేర్కొన్నాడు.

'కోహ్లికి 19 ఏళ్ల వయసులో అతనిలో కొన్ని లక్షణాలు నన్ను ఆకర్షించాయి.  అతని నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలిచిన తరువాత కోహ్లిని తొలిసారి చూశా. రాయల్ చాలెంజర్స్ కు ఆడుతున్న సమయంలో కోహ్లి నడుచుకుంటూ వెళుతున్నాడు.అది అతన్ని మొదటిసారి చూడటం. ఆ సయమంలో అతను గేమ్ ను అభివృద్ధి చేసుకోవడం కోసం పడే తాపత్రాయం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. విరాట్ కోహ్లి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. అతనొక బ్రిలియంట్ క్రికెటర్'అని కుంబ్లే పేర్కొన్నాడు.

ఇదిలా ఉంచితే, కోచ్ గా తాను కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు కుంబ్లే తెలిపాడు. ఒక ఆటగాడ్ని ఫలానా మ్యాచ్ లో వేసుకోవడం లేదనే విషయాన్ని అతనికి చెప్పడం చాలా కష్టంగా ఉందన్నాడు. 'నువ్వు ఆడటం లేదని కానీ, నువ్వు స్క్వాడ్ లో లేవని కానీ ఆటగాళ్లకు చెప్పడం 'కోచ్ గా విపరీతమైన కష్టంగా ఉందన్నాడు. అయితే నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Dinesh karthik defends indian cricket team spinners after loss

  వారికి అది అరుదైన దురదృష్టకరమైన రోజు

  Oct 23 | ముంబై వేదికగా జరిగిన తొలివన్డేలో టీమిండియా విజయాల పరంపరకు బ్రేకులు పడటం.. అభిమానులకు కాసింత నిరాశనే మిగిల్చినా.. స్పీన్నర్లను కివీస్ బ్యాట్స్ మెన్లు చితకబాదడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వారిని టీమిండియా... Read more

 • Virat kohli reveals reason for hosts defeat in mumbai

  పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించలేకపోయాం, అందుకే..

  Oct 23 | ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజీలాండ్ తో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడానికి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించకపోవడమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ లో... Read more

 • Hasan ali pakistan pace sensation becomes no 1 odi bowler in icc rankings

  ఐసీసీ ర్యాకింగ్స్: టాప్ ప్లేస్ లో ఏబీ డెవిలియర్స్...

  Oct 20 | టీమిండియాను వెనక్కి తోసిరాజుతూ సౌతాఫ్రికా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా టాప్ ప్లేస్ ను అందుకుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సఫారీలు ప్రథమ స్థానానికి... Read more

 • Under observation kapugedera likely to feature in fifth odi

  ఐదో టెస్టుకు అందుబాటులోకి చమర కపుగెదర

  Oct 20 | పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న శ్రీలంక మిడిల్ అర్ఢర్ ప్రముఖ క్రికెటర్ చమర కపుగెదర ఐదో వన్డేకు అందుబాటులోకి రానున్నాడని జట్టు యాజమాన్యం తెలిపింది. యూఏఈ, పాకిస్థాన్ జట్లలో షార్జాలోని  షేక్ జాయెద్... Read more

 • Virender sehwag retaliates sachin tendulkar caught off guard

  బర్త్ డే రోజున కూడా తనదైన స్టయిల్ లోనే వీరూ..

  Oct 20 | వినూత్న ట్వీట్లకు టీమిండియా డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టింది పేరు. అలాంటిది కనీసం ఆయన తన పుట్టిన రోజునైనా వచ్చిన ట్విట్లకు సరిగ్గా సమాధానం చెబుతారా..? లేక ఈ రోజు కూడా జోరుగా... Read more

Today on Telugu Wishesh