ఆ ఇద్దరే నాకు స్ఫూర్తి.. పూర్వవైభవానికి కృషి.. Root looks to channel Kohli and Smith

Virat kohli steve smith are joe root s inspiration as england captain

India vs England, England, Team India, Joe Root, captain, england new test captain, Virat Kohli, Alastair cook, India, Steve Smith, sport, cricket

Joe Root said he would look to draw inspiration from Virat Kohli and Steve Smith as he embarked on his journey as England's new Test captain.

ఆ ఇద్దరే నాకు స్ఫూర్తి.. పూర్వవైభవానికి కృషి..

Posted: 02/16/2017 07:25 PM IST
Virat kohli steve smith are joe root s inspiration as england captain

ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఎంపికైన క్రికెటర్ జో రూట్ వారిద్దరే తనకు స్ఫూర్తి, ఆదర్శం అని అంటున్నారు. ఇంగ్లండ్ టెస్టు సారథిగా అలెస్టర్ కుక్ ఇటీవలే వైదొలిగిన తరువాత జో రూట్ కు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే  అటు కెప్టెన్లుగా, ఇటు బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న విరాట్ కోహ్లి,  స్టీవ్ స్మిత్లే తనకు అత్యంత ఆదర్శమని అంటున్నాడు జో రూట్. 'ఆయా జట్ల సారథులుగా విరాట్, స్మిత్ లకు తిరుగులేదు. ఆ ఇద్దరూ కెప్టెన్లుగా నియమించబడ్డ తరువాత అద్భుతమైన ఫామ్ తో చెలరేగిపోతున్నారు. వారి బ్యాటింగ్ ప్రతిభతో జట్లకు అసాధారణ విజయాలు సాధించిపెడుతూ కీలక సభ్యులుగా మారిపోయారు.

ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నేను కూడా వారినే అనుసరిస్తూ జట్టుకు విజయాలను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. విరాట్, స్మిత్ లు  బ్యాటింగ్ తో రాణిస్తూ వారి స్థాయిని పెంచుకోవడమే కాదు.. వారి జట్లను కూడా తదుపరి స్థాయికి తీసుకుపోయారు. వారిలా నేను ఎందుకు చేయలేను. వారి అడుగుజాడల్లో ఎందుకు నడవకూడదు 'అని జో రూట్ తన కెప్టెన్సీ బాధ్యతపై ఉద్వేగంగా మాట్లాడాడు.

ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా చేయడం నిజంగా తనకు దొరికిన గొప్ప అవకాశమన్నాడు. మా దేశంలో ఉన్న ప్రతీ కుర్రాడు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా చేయాలని కలలు కంటాడని, అది తన కెరీర్ లో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి సర్వశక్తులు పెట్టి పోరాడుతానని.. తన జట్టుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జో రూట్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles