ట్విట్టర్ విమర్శలపై స్పందించిన వీరూ Virender Sehwag responds to criticism on social media

Virender sehwag responds to criticism on social media

India vs pakistan, bling t20 world cup, twitter, team india, other men in blue, virender sehwag, virender sehwag blind cricket team, india blind cricket team, blind t20 world cup, t20 world cup blind cricket team, cricket news, cricket

Virender Sehwag responded to criticism on social media and said the #othermeninblue was part of the official campaign.

ట్విట్టర్ విమర్శలపై స్పందించిన వీరూ

Posted: 02/14/2017 06:34 PM IST
Virender sehwag responds to criticism on social media

సందర్భాన్ని బట్టి తనదైనశైలితో ట్వీట్ చేస్తూ అందరి మన్ననలు పొందే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. తను చేసిన ట్విట్పై నెట్ జనుల విమర్శలకు స్పందించాడు. అంధుల టీ20 వరల్డ్ కప్ విజేతలను అభినందిస్తూ.. సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. వారి టీ20కి అదే తరహాలో ప్రచారం సాగిందని, అందుకనే తాను అలా ట్విట్ చేశానని వీరూ చెబుతున్నారు. ఇక మరికోందరు అదేపనిగా అయనను విమర్శించడంతో.. వారికి పరిశోధన చేయాలని చెప్పారు.
 
మొన్నీమధ్య జరిగిన అంధుల టీ-ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ ‘‘అంధుల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన మరో నీలి రంగు జట్టుకు అభినందనలు. వాళ్లు వంద కోట్లమందికి చిరునవ్వులు పంచారు’’ అని ట్వీట్ చేశాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి ఈ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన అజయ్ వీరూ తమను అభినందించడం సంతోషమేనని, కాకపోతే మరో నీలి రంగు జట్టు అని పేర్కొనడమేంటని ప్రశ్నించాడు. తాము కూడా దేశం కోసమే ఆడుతున్నామని, దేశం కోసమే సీరియస్‌గా ఆడతామని అజయ్ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs pakistan  bling t20 world cup  twitter  team india  other men in blue  cricket  

Other Articles