ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు..! Two PSL players suspended over match-fixing

Sharjeel khan khalid latif suspended in psl spot fixing row

Pakistan Super League, Sharjeel Khan, Khalid Latif, Spot Fixing Scandal, Pakistan Cricket Board, pakistan cricket team, T20, corruption, cricket

Sharjeel Khan and Khalid Latif were suspended by the PCB on corruption charges and sent back home from Dubai, where they were competing in the Pakistan Super League.

ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు..!

Posted: 02/11/2017 03:33 PM IST
Sharjeel khan khalid latif suspended in psl spot fixing row

ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. స్పాట్ ఫిక్సింగ్ అరోపణలపై వీరిద్దరినీ పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి తప్పిస్తూ.. స్వదేశానికి పంపించింది. దుబాయ్ లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వీరిద్దరూ స్పాట్ ఫిక్సింగ్ లకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో విచారణ చేపట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వీరిద్దరినీ దుబాయ్ లో ఉండనివ్వకుండా వారిని పాకిస్తాన్ కు పంపించి వేసింది.

ఈ క్రమంలోనే ఐసీసీ సహకారంతో విచారణ చేపట్టిన పీసీబీ..వారిద్దరికీ ఫిక్సింగ్ తో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ వేటు వేసినా.. వారు నిజంగానే ఫిక్సింగ్ కు పాల్పడిన ఎటువంటి ఆధారాలను పీసీబీ వెల్లడించలేదు. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన వీరిద్దరూ జాతీయ స్థాయి క్రికెటర్లే. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో షర్జిల్ సభ్యుడు. అతను పాకిస్తాన్ తరపున ఇప్పటివరకూ 25 వన్డేలు, 15 ట్వంటీ 20లు ఆడాడు. మరొకవైపు గతేడాది వరల్డ్ ట్వంటీ 20 పాల్గొన్న పాక్ జట్టులో లతిఫ్ సభ్యుడు. కేవలం ఐదు వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడిన లతిఫ్..13 ట్వంటీ 20 మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles