టీమిండియాతో పాటు కెప్టెన్ కోహ్లీ కొత్త రికార్డులు Virat Kohli: four double-tons in four series

India plunder bangladesh become first team to make 600 plus runs

team india, 600 runs score, india vs bangladesh, Virat Kohli, India v Bangladesh at Hyderabad (Deccan), Bangladesh tour of India, Bangladesh cricket, India cricket, bangladesh, virat kohli, 600 runs, hyderabad test, sports news, cricket

India became the first team to score 600-plus in three consecutive innings. 4 Number of consecutive series in which Virat Kohli has scored a double-century.

టీమిండియాతో పాటు కెప్టెన్ కోహ్లీ కొత్త రికార్డులు

Posted: 02/10/2017 09:09 PM IST
India plunder bangladesh become first team to make 600 plus runs

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సరికొత్త మైలురాయిని సాధించాడు. అంతేకాదు అతని కెప్టెన్సీలో టీమిండియాను కూడా అరుదైన ఘనతను సాధించేలా చేశారు. బంగ్లాదేశ్ తో హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులోతొలి రోజు సెంచరీ సాధిండం ద్వారా తాను ఆడిన ప్రతీ టెస్టు హోదా దేశంపై శతకాలు సాధించిన ఘనతను సాధించిన కోహ్లి.. తాజాగా  ఒక స్వదేశీ సీజన్ లో అత్యధిక టెస్టు పరుగులు నమోదు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తద్వారా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(1105) రికార్డును కోహ్లి చెరిపేశాడు. 2004-05 సీజన్ లో సెహ్వాగ్ ఈ అరుదైన మార్కును చేరగా, దాదాపు 13 ఏళ్ల తరువాత ఆ రికార్డును కోహ్లి బద్ధలు కొట్టాడు. 2016-17 సీజన్లో 15 టెస్టులాడిన  కోహ్లీ 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో  తొలి స్థానంలో నిలిచాడు.

శుక్రవారం రెండో రోజు ఆటలో కోహ్లి మరో శతకం నమోదు చేశాడు. ఓవరాల్ గా 239 బంతుల్లో 24 ఫోర్లతో డబుల్ సెంచరీతో కోహ్లి అదరగొట్టాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్లో నాల్గో డబుల్ సెంచరీ కావడం విశేషం. మరొకవైపు ఈ నాలుగు డబుల్ సెంచరీల్ని వరుస టెస్టు సిరీస్ల్లో సాధించడం మరొక విశేషం. తొలుత వెస్టిండీస్ పై ద్విశతకం కొట్టిన కోహ్లి.. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరిగిన వరుస టెస్టుల్లో కూడా డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇలా వరుస సిరీస్ ల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి కొత్త రికార్డు నెలకొల్పాడు.

గత ఏడు నెలల కాలంలో కోహ్లి వరుసగా నాలుగు డబుల్ సెంచరీల్ని సాధించడం అతనిలోని అసాధారణ ఆటకు అద్దం పడుతోంది. గతేడాది జూన్ లో విండీస్ పై డబుల్ సెంచరీ వేటను ఆరంభించిన కోహ్లి.. వరుస సిరీస్ ల్లో ద్విశతకాలను సాధిస్తూ దుమ్మురేపుతున్నాడు. ఈ రోజు ఆటలో భాగంగా తొలుత ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. ఈ జోడి 222 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే రహానే(82) నాల్గో వికెట్ గా అవుట్ కావడంతో వీరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లి డబుల్ సెంచరీని సాధించాడు.

కాగా, ఈ టెస్టు ద్వారా టీమిండియా అరుదైన రికార్డును సోంతం చేసుకుంది. రెండు రోజైన శుక్రవారం టీమిండియా స్కోరు 600 పరుగులకు చేరగానే ఈ ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్‌ల్లో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సాధిచింది. భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టుపై రెండు సార్లు, తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏకైక టెస్టు అడుతున్న బంగ్లాపై 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో రికార్డును సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs bangladesh  team india  bangladesh  virat kohli  600 runs  hyderabad test  sports news  cricket  

Other Articles