లంకేయులకు చెమటలు పట్టించిన సఫారీలు Miller and du Plessis hundreds set up thumping victory

Miller and du plessis hundreds set up thumping victory

Du Plessis thrilled with SA fielding displays, Miller ruled out of rest of Sri Lanka series, Faf du Plessis, David Miller, South Africa v Sri Lanka at Durban, Sri Lanka tour of South Africa, South Africa cricket, Sri Lanka cricket

Faf du Plessis and David Miller struck centuries as South Africa cricket team beat Sri Lanka cricket team by 121 runs in the second one-day International.

లంకేయులకు చెమటలు పట్టించిన సఫారీలు

Posted: 02/02/2017 08:57 PM IST
Miller and du plessis hundreds set up thumping victory

పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్ లో మాత్రం చెలరేగిపోతోంది. స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగరంగా డర్భన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సైతం సఫారీలు ఏకపక్ష విజయం సాధించారు. లంకేయుల్ని 37.5 ఓవర్లలో186 పరుగులకే కూల్చిసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సఫారీలు సత్తాచాటుకుని 121 పరుగుల తేడాతో విజయం సాధించారు.ఇరు జట్ల మధ్య జరిగిన  డే అండ్ నైట్  మ్యాచ్ లో టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్(105), మిల్లర్(117) శతకాలతో మెరిశారు. ఈ జోడి ఐదో వికెట్ కు 117 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. తొలుత లంకేయుల్ని కుమ్మేసిన సఫారీలు.. ఆ తరువాత పేకమేడలా కూల్చేశారు. దక్షిణాఫ్రికా విసిరిన 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ ఒక్కరూ లంక క్రికెటర్ కనీసం హాఫ్ సెంచరీ మార్కును చేరకపోవడంతో వారికి ఘోర ఓటమి ఎదురైంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-0 తో ఆధిక్యంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Africa v Sri Lanka  miller  du plessis  south africa  srilanka  cricket  

Other Articles