14 ఏళ్ల తరువాత.. వాంఖేడ్ లో టీమిండియా ఓపెనర్ శతకం.. Dhoni Has Earned the Right To Play says Clarke

Dhoni has earned the right to play as long as he wants michael clarke

india vs england, ind vs eng, india england, india cricket team, mahendra singh dhoni, michael clarke, MS Dhoni, virat kohli, Team India, England, cricket score, cricket news, cricket

Dhoni has been a wonderful captain for India and there is no doubt about that. If he feels it is the moment then I think it is the right time to step down and allow someone else to take the reigns

టీమిండియాకు అద్భుత కెప్టెన్ గా ధోని సేవలు: క్లార్క్

Posted: 01/06/2017 06:46 PM IST
Dhoni has earned the right to play as long as he wants michael clarke

భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనిపై మన దేశ క్రికెటర్లు గవాస్కర్, సచిన్ టెండుల్కర్ తరువాత ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ధోనిని ప్రశంసతలతో ముంచెతుత్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోని కచ్చితంగా అత్యుత్తమ నాయకుడని కితాబిచ్చాడు. అతని నాయకత్వ లక్షణాలతో భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడంటూ కొనియాడాడు.

మ్యాచ్లో విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆడే ధోని స్వభావం తనకు ఎంతో ఇష్టమన్నాడు. అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో ధోని ఒక చరిత్ర సృష్టించాడని క్లార్క్ పేర్కొన్నాడు. ఒక దేశానికి క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉండాలంటే అది చాలా కష్టమన్నాడు. అందులోనూ క్రికెట్ ను ఒక మతంలా భావించే భారత్లో ఒత్తిడితో కూడుకున్నదని క్లార్క్ విశ్లేషించాడు. భారత్లో క్రికెట్ గేమ్ పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో తాను ఊహించగలనని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్క్ పేర్కొన్నాడు.

ఒక కెప్టెన్ ఎంత వరకూ చేయాలో అంతకంటే ఎక్కువే ధోని చేశాడన్న క్లార్క్.. అతను ఎప్పుడూ సరైన మార్గంలోనే క్రికెట్ ను ఆడుతూ జట్టుకు చిరస్మరణీయమైన సేవలందించాడని ర్కొన్నాడు. అయితే రాబోవు రోజుల్లో భారత విజయాల్లో ధోని పాత్ర ఉంటేనే అతను 2019 వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగుతాడని, కాని పక్షంలో అతని క్రికెట్ కెరీర్ను పెంచుకునే అవకాశం ఉండదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలామంది యువకులు ఉన్నారని ఈ సందర్భంగా క్లార్క్ గుర్తు చేశాడు. కచ్చితంగా విరాట్ కోహ్లికి బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందని భావించే ధోని ఆ నిర్ణయం తీసుకున్నాడని క్లార్క్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  Michael Clarke  ms dhoni  virat kohli  Team India  England  cricket  

Other Articles