మెక్ గ్రాత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అశ్విన్ కు చోటు Virat Kohli is captain of Glenn McGrath's Test Team

Virat kohli chosen to lead mcgrath s test team of the year

india vs england, Ben Stokes, David Warner, Glenn McGrath, Joe Root, Kane Williamson, Mitchell Starc, Ravichandran Ashwin, steve smith, test team, virat kohli, cricket

Australian pacer Glenn McGrath picked India Test skipper Virat Kohli to lead his Test Team of the Year, Ashwin as the other Indian in the 12-member squad.

మెక్ గ్రాత్ టెస్టు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అశ్విన్ కు చోటు

Posted: 12/30/2016 06:24 PM IST
Virat kohli chosen to lead mcgrath s test team of the year

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు జపించకుండా ఏ దేశ క్రికెట్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది అయన కనబర్చిన అసాధారణ బ్యాటింగ్, కెప్టెన్ హోదాలో గెలిచిన విజయాలతో ఇప్పటికే క్రికెట్ చరిత్రలో పలు రికార్డులను సొంతం చేసుకున్న తరుణంలో.. తాజాగా అస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ జట్టుకు సారధ్యం వహించే అవకాశాన్ని కూడా అందుకున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వన్డే జట్టుకు కెప్టెన్ ఎంపికైన కోహ్లికి గ్రాత్ జట్టు నుంచి కూడా అదే స్థాయిలో పిలుపువచ్చింది.

అస్ట్రేలియా పేసర్ గ్రాత్ జట్టుకు కూడా సారధిగా విరాట్ ఎంపికయ్యాడు. ఈ ఏడాదికి గాను మెక్గ్రాత్ ఎంపిక చేసిన  తన టెస్టు జట్టులో కోహ్లికి నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పాడు.  దాంతోపాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత్ ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ కూడా మెక్ గ్రాత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కాగా మరో భారత అటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా గ్రాత్ జట్టులో స్థానం సంపాదించాడు.

12 మందితో కూడిన మెక్ గ్రాత్ టెస్టు జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జానీ బెయిర్ స్టోలు ఉండగా, న్యూజిలాండ్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ చోటు దక్కించుకున్నాడు. ఇక పాకిస్తాన్ నుంచి స్పిన్నర్ యాసిర్ షా, దక్షిణాఫ్రికా నుంచి పేసర్ రబడాలకు చోటు దక్కించుకున్నారు. మరొకవైపు ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లను మాత్రమే తన జట్టులో మెక్ గ్రాత్  ఎంపిక చేశాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్లను ఆసీస్ జట్టు నుంచి మెక్ గ్రాత్ తీసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat Kohli  Glenn McGrath  ashwin  india  dream team  cricket  

Other Articles