ఐసీసీ టెస్టు జట్టులో కోహ్లీకి స్థానం లేదా..?: అనురాగ్ ఠాకూర్ Anurag Thakur Questions ICC, on not including kohli in Test Team

Anurag thakur questions icc on not including kohli in test team

Virat Kohli, ICC Test Team of the Year, ICC number one rank, Team India, kohli, Anurag Thakur, BCCI, sports news, cricket news, sports, cricket

Virat Kohli scored 451 runs at 45.10 with the help of a century and a fifty during the voting period from September 2015 to September 2016.

ఐసీసీ టెస్టు జట్టులో కోహ్లీకి స్థానం లేదా..?: అనురాగ్ ఠాకూర్

Posted: 12/24/2016 05:51 PM IST
Anurag thakur questions icc on not including kohli in test team

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన టెస్టు జట్టులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి స్థానం దక్కకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఒకసారి ఐసీసీ పరీశీలిస్తే బాగుండేదని ఆయన సూచించారు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్ వన్ గా ఉందనే విషయం గుర్తు చేశారు. ఒక నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తికి టెస్టు జట్టులో స్థానం దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

ఈ జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఐసీసీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే బాగుండేదనేది అయన అభిప్రాయపడ్డాడు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఆటగాళ్లు ప్రదర్శన కాకుండా, గత జనవరి నుంచి వచ్చే జనవరి వరకూ ఆటగాళ్ల ప్రతిభను పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ గా ఉండి, ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లికి ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో చోటు లభించకపోవడం బాధాకరమని అవేదన వ్యక్తం చేశాడు. కాకపోతే ఐసీసీ వన్డే కెప్టెన్ గా కోహ్లిని ఎంపిక చేయడం మాత్రం నిజంగా శుభవార్తేనన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  ICC Test Team  number one rank  kohli  Anurag Thakur  BCCI  cricket  

Other Articles