చివరి టెస్టులో జడేజా విజృంభణతో విజయం jadeja seven wicket haul make india win final test

Jadeja seven wicket haul make india win final test

Team India, India vs England, ravindra jadeja, ravichandran ashwin, Anurag Thakur, karun nair, rahul dravid, BCCI, sports, sports news, cricket news, cricket

Spinner Ravindra Jadeja was the hero of the day as he returned exceptional figures of 7/48 to spell doom for England.

చివరి టెస్టులో జడేజా విజృంభణతో విజయం

Posted: 12/20/2016 06:57 PM IST
Jadeja seven wicket haul make india win final test

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరిదైన ఐదవ టెస్టు ఆఖరి రోజు ఆటలో భారత స్సిన్నర్ రవీంద్ర జడేజా ఒక్కసారిగా మెరిశాడు. మరో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సొంతగ్రౌండ్ లో జడేజా అద్భుత ప్రతిభను కనబర్చాడు. జడేజా చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి మూలకారణంగా నిలిచాడు. ఏకంగా వికెట్లు సాధించి ఇంగ్లండ్ టాపార్డర్ను కకావికలం చేయడంతో పాటు టెయిల్ ఎండర్స్ ను కూడా క్రమంగా పెవిలీయన్ దారి చూపాడు.

వికెట్లు నష్టపోకుండా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు పన్నెండు గంటల వరకు క్రీజ్ వద్ద పాతుకుపోయినట్లు కనిపించింది. ఆ తరువాత టాప్ అలెస్టర్ కుక్ (49), జెన్నింగ్స్(54), లను ఔట్ చేయడంతో జడేజా బంతి పదునెక్కింది. అంతే అదే క్రమంలో రూట్(6), మొయిన్ అలీ(44), స్టోక్స్(23) లను అవుట్ చేశాడు. దాంతో టీ విరామం తరువాత ఇంగ్లండ్ 192 పరుగుల వద్ద ఆరో వికెట్ను నష్టపోయింది. మొయిన్ అలీని ఐదో వికెట్ గా జడేజా అవుట్ చేయగా ఆ తరువాత కొంత సేపటికి స్టోక్స్ ను అవుట్ చేశాడు. ఇక టెయిల్ ఎండర్స్ కు కూడా పెవిలీయన్ దారి చూపిన జడేజా చివరి టెస్టులో ఏకంగా పది వికెట్లు పడగోట్టి తన సత్తా చాటుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India vs England  ravindra jadeja  ravichandran ashwin  cricket  

Other Articles