యాషెస్ డే-నైట్ టెస్టుపై జాన్సన్ విముఖత Mitchell Johnson Slams Day-Night Ashes Test

Mitchell johnson slams day night ashes test

ashes, Australia vs Pakistan 2016-17, Mithcell Johnson, Pink Ball Ashes, england vs australia, mitchell johnson, ashes series, england, australia, cricket

Former Australia paceman Mitchell Johnson has slammed the decision to play a day-night Ashes match next year, saying the pink ball test is a "totally different" game

యాషెస్ డే-నైట్ టెస్టుపై జాన్సన్ విముఖత

Posted: 12/17/2016 06:47 PM IST
Mitchell johnson slams day night ashes test

వచ్చే ఏడాది జరుగనున్న యాషెస్ సిరీస్లో ఒక టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్గా నిర్వహించాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతిపాదనను ఆ దేశ మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ ఖండించాడు. యాషెస్ సిరీస్లో ప్రయోగాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదంటూ ధ్వజమెత్తాడు.పింక్ బాల్ మ్యాచ్ అంటే ఓవరాల్గా భిన్నంగా ఉంటుందని, అందుచేత యాషెస్లో డే అండ్ నైట్ మ్యాచ్ అవసరం లేదన్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం తనను నిరుత్సాహానికి గురి చేసిందన్నాడు. ఈ తరహా టెస్టు క్రికెట్ను తాను ఊహించడం లేదని విమర్శించాడు.

'సాధారణంగా అడిలైడ్ టెస్టు క్రికెట్లో గ్రాస్ అనేది ఉండదు. కాకపోతే ఇటీవల జరిగిన రెండు డే అండ్ నైట్ టెస్టుల్లో అడిలైడ్లో చాలా ఎక్కువ మోతాదులో పచ్చదనం చూశాం. ఈ రకంగా ఉండటం బౌలర్లదే పైచేయి అవుతుంది. ఒక బౌలర్గా నేను సంతోషంగా ఉండాలి. కానీ మ్యాచ్ గణాంకాలు ఒక్కసారిగా మారిపో్యే ప్రమాదం ఉంది. ఈ పద్ధతిని నేను ఇష్టపడను' అని మిచెల్ జాన్సన్ తెలిపాడు.వచ్చే ఏడాది నవంబర్లో ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా రెండో టెస్టును అడిలైడ్లో పింక్ బాల్ నిర్వహించేందుకు సీఏ అంగీకారం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england vs australia  mitchell johnson  ashes series  england  australia  cricket  

Other Articles