మళ్లీ అదే సీన్.. కొట్టుకున్నంత పనిచేసి.. Yasir Shah, Wahab Riaz come to blows at practice session

Pcb seeks report after brawl between wahab riaz and yasir shah

Sohail Khan, Misbah-ul-Haq, Wahab Riaz, Rahat Ali, Yasir Shah, Wasim Bari, Pakistan Cricket Board (PCB), Cricket

Pakistan Cricket Board has taken a serious view of the bust-up between Wahab Riaz and Yasir Shah during a training session in Brisbane

మళ్లీ అదే సీన్.. తీరు మారని పాకిస్తాన్ క్రికెటర్లు..

Posted: 12/15/2016 06:37 PM IST
Pcb seeks report after brawl between wahab riaz and yasir shah

పాకిస్తాన్ క్రికెట్కు.. వివాదాలకు దెగ్గరి అవినాభావ సంబంధముందని అంటే అది అతిశయోక్తి కాదేమో. అదేంటి ఏ జట్టులోనైనా కామన్ కదా, అంటారా..? మేము చెబుతున్నది జట్టులోని సభ్యల మధ్య చెలరేగే గొడవల గురించి. సాధారణంగా క్రికెట్ అడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టుతో వాగ్వాదం జరగడం సహజమే. అయితే జట్టు సభ్యులే ఒకరిపై మరోకరు తిరగబడితే.. అదే తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ల మధ్య చోటుచేసుకుంది. సరిగ్గా అస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ జరిగే ముందు రోజున పాకిస్థాన్ క్రికెటర్లు ఒకరినోకరు కొట్టుకున్నంత పనిచేసుకున్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇద్దరు సీనియర్ క్రికెటర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షాల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. వీరిద్దర మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ చివరకు ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. వీరిద్దరి మధ్య వాడివేడి మాటల యుద్ధం తోపులాటలు స్తాయికి చేరుకుంది. ఫుట్ బాల్తో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రియాజ్తో యాసిర్ గొడవ పడ్డాడు. దాంతో నువ్వేంత అంటే నువ్వెంత అనే వరకూ ఆ క్రికెటర్లు తమ మాటల వాడిని కొనసాగించారు.

ఆ గొడవ ముదరడంతో జట్టు సభ్యులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ మేరకువారి మధ్య జరిగిన ఘర్షణ ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్వీట్ చేసింది. దాంతో ఆ క్రికెటర్లపై చర్యలు తప్పవని అంతా భావించారు. కాగా,  ఆ గొడవను పాక్ క్రికెట్ టీమ్ మేనేజర్ వాసిమ్ బారి కొట్టిపారేశారు. ఇది  పెద్ద ఘర్షణగా కాదని పేర్కొన్న బారి.. ఆ క్రికెటర్లపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించాడు.

గతంలో షోయబ్ అక్తర్-మొహ్మద్ అసిఫ్లు ఫీల్డ్లోనే ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. 2007 వరల్డ్ టీ 20 సమయంలో షోయబ్ అక్తర్  అసిఫ్ ను బ్యాట్తో కొట్టాడు. అది అప్పట్లో అది పెద్ద వివాదమైంది.  ఆ తరువాత తన కెరీర్ ముగింపుకు వసీం అక్రమే కారణమంటూ అక్తర్ ధ్వజమెత్తి మరో వివాదానికి తెరలేపాడు. ఇదిలా ఉండగా, ఒక టీ షోలో మొహ్మద్ యూసఫ్-రమీజ్ రాజాలు ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారు. మరొకవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీసీఎల్)లో వాహబ్ రియాజ్- అహ్మద్ షెహ్జాద్లు ఒకర్నినొకరు తోసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pakistan vs england  Yasir Shah  Wahab Riaz  pakistan  PCB  cricket  

Other Articles