కోహ్లీ కెప్టెన్సీలో పలు మెరుగులు అవసరం Virat Kohli the best in business, says Sunil Gavaskar

Virat kohli s captaincy has room for improvement says sunil gavaskar

Virat Kohli, MSK Prasad, Sunil Gavaskar, MS Dhoni, Maninder Singh, India v England 2016, England v India, England in India, Aakash Chopra

Virat Kohli is turning into the latest man with the Midas touch, former India skipper Sunil Gavaskar told there is room for improvement in the 28-year-old’s captaincy.

కోహ్లీ కెప్టెన్సీలో పలు మెరుగులు అవసరం

Posted: 12/14/2016 06:41 PM IST
Virat kohli s captaincy has room for improvement says sunil gavaskar

టీమిండియా విధ్వంసకర బ్యాట్స్ మెన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మరిన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసముందని టీమిండియా మాజీ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే సెలక్షన్ కమిటీ పగ్గాలను చేపట్టిన తెలుగువాడు ఎంఎస్‌కే ప్రసాద్‌ కు విరాట్ కోహ్లీ విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోంటున్నారని అన్నారు. అదేంటంటే కోహ్లీకి మూడు ఫార్మెట్ల కెప్టెన్సీ పగ్గాలను అందించాలన్నదేనని చెప్పారు. అయితే.. ఇలా తలెత్తే డిమాండ్లపై సెలక్షన్ కమిటీ తలొగ్గకూడదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

గత రెండేళ్లుగా టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి అసాధారణమైన ప్రతిభను చాటుతున్నాడని.. అయన అద్భుతమైన అటగాడని అందులో ఎలాంటి సందేహం లేదని, అయితే మూడు ఫార్మెట్ల కెప్టెన్ గా ఎదిగేందుకు ఆయనకు ఇంకా కొంచెం సమయం కావాలని అన్నాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీలో ఇంకా మెరుగులు దిద్దుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీకి పదికి గాను ఎన్ని మార్కులు వేస్తారని ప్రశ్నించగా, ఏడు నుంచి ఏడున్నర మార్కులు మాత్రమే వేస్తానని గవాస్కర్ తేల్చిచెప్పాడు.

2016 నుంచి బ్యాటుతో కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడని కితాబునిచ్చారు. ప్రపంచంలోని ఏ పిచ్ అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్న కోహ్లీ కేవలం ఇంగ్లండ్ లోనే రాణించలేదని తెలిపాడు. కోహ్లీకి మార్కులు వేయాల్సి వస్తే పదికి ఏడు మార్కులు వేస్తానని తెలిపారు. మరికొన్ని విభాగాల్లో కోహ్లీ పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీనికి మరికొంత అనుభవం అవసరమని ఆయన చెప్పారు. ఇంగ్లండ్ లో కూడా కోహ్లీ రాణించి సత్తాచాటుతాడని, అది త్వరలోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MSK Prasad  Sunil Gavaskar  MS Dhoni  India v England 2016  Aakash Chopra  

Other Articles