అండర్ సన్ కు ఇంజామామ్ హితబోధ.. Inzamam criticises Anderson over comments on Kohli

Inzamam ul haq criticises james anderson over comments on virat kohli

virat kohli, kohli, james anderson, anderson, kohli anderson, inzamam-ul-haq, inzamam, india vs england, india vs pakistan, cricket news, cricket

Anderson had recently said Kohli's technical deficiencies were not at display during the ongoing Test series because the pitches in India are devoid of bounce.

విరాట్ కోహ్తీని విమర్శించే హక్కు నీకు వుందా...?

Posted: 12/13/2016 06:44 PM IST
Inzamam ul haq criticises james anderson over comments on virat kohli

భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ దిగ్గజం, పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్ ఇంగ్లాండ్ పేస్ బౌలర్ అండర్ సన్ కు హితబోధ చేశారు. కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ ను ప్రశ్నించే స్థాయి ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కు లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ ను విమర్శించే ముందు భారత్ లో వికెట్లు ఎలా తీయాలో తెలుసుకుంటే మంచిదని ఇంజమామ్ సూచించాడు. జియో సూపర్ స్పోర్ట్స్ చానల్‌లో మాట్లాడుతూ భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరగకపోవడం పాకిస్థాన్ క్రికెట్‌ను చాలా బాధపెట్టిందని చెప్పాడు. ద్వైపాక్షిక టోర్నీలు జరగకపోవడం క్రికెట్‌కు, ఇరుదేశాలకు మంచిది కాదని అన్నాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్ కోణంలో చూస్తే మాత్రం ఇప్పటికే చాలా నష్టం జరిగిందని చెప్పాడు.

ఇతర దేశాల ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లాడేందుకు పాకిస్థాన్‌కు రావడంలేదని, పాక్ యువ క్రికెటర్లు సీనియర్ జట్టులో ఆడే ముందు అంతర్జాతీయ టీంలతో ఆడే అవకాశాన్ని పొందలేక పోతున్నారని తెలిపాడు. ప్రజలు ఇరుదేశాల మధ్య మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటున్నారని, కానీ ప్రభుత్వాల స్థాయిలో పరిస్థితులు చక్కబడే వరకూ ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించాడు. అయితే వ్యక్తిగతంగా తాను భారత్‌తో క్రికెట్ ఆడటాన్ని ఎంజాయ్ చేశానని, ఆటగాడిగా కూడా అది తనకు చాలా దోహదపడిందని చెప్పాడు. తన దృష్టిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కన్నా భారత్, పాక్‌ల సిరీస్ చాలా పెద్దదని చెప్పాడు

ఇక విరాట్ బ్యాటింగ్ టెక్నిక్ను విమర్శిస్తూ అండర్సన్ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. విరాట్ ను ప్రశ్నించే ముందు అండర్ సన్ భారత్లో వికెట్లు తీసే పాఠాలు నేర్చుకుంటే మంచిది. ఇప్పటివరకూ అండర్సన్ భారత్లో వికెట్లు తీయడం తానెప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశాడు. ఒక బ్యాట్స్మన్ టెక్నిక్ను ప్రశ్నించే స్థాయిలో నీవు ఉన్నావా అనేది తెలుసుకుని ఆ తరువాత మాట్లాడుటం మంచిదని ఇంజమాన్ సూచించాడు.

తన బౌలింగ్ను ఇంగ్లండ్లో విరాట్ ఎదుర్కోలేక పోయాడని చౌవకబారు వ్యాఖ్యలు చేసిన అండర్ సన్ పై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్లో ఆడితేనే నాణ్యమైన బ్యాట్స్మన్ అని సర్టిఫికెట్ ఇస్తారా?, ఉప ఖండం పిచ్ల్లో ఆడేటప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడకపోతేనే మంచిది. ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేసే విదేశీ ఆటగాళ్లకు నేనిచ్చే సూచన మాత్రమేన్నారు.  ఒక ఆటగాడు ఎక్కడ పరుగులు చేసినా వాటిని పరుగుల గానీ పరిగణిస్తారని విషయం బోధ పడితే మంచిదని ఇంజమామ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  james anderson  inzamam-ul-haq  india vs england  cricket  

Other Articles