ముంబై టెస్ట్: అశ్విన్ తిప్పాడు.. నిమిషాల్లో గెలిచేశాం | Another series victory for Kohli team.

Team india won fourth test against england

Team India Mumbai test, Mumbai test, Virat Kohli Mumbai Test, Fifth Constructive series win for Team India, Thee Double Centuries in a Year, Virat Kohli 2016, Ashwin anil kumble record, Ashwin again 10 wickets, Ashwin in Mumbai test

Team India Won Fourth Test as well as Series against India.

ముంబై టెస్ట్ కూడా గెలిచేశారు

Posted: 12/12/2016 10:47 AM IST
Team india won fourth test against england

నాలుగు వికెట్లు కేవలం నిమిషాల్లో లేపి పడేవాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విని. అంతే... భారత్ ఖాతాలో 135వ టెస్ట్ విజయం వచ్చి చేరింది. ముంబై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో 186 పరుగుల స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించగా, ఆ వెంటనే టీమిండియా విజయమూ ఖాయమైపోయింది.

ఆట ప్రారంభించిన 8 ఓవర్లకే ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఆలౌట్ అయ్యారు. మరోసారి ఆరువికెట్లు తీసిన అశ్విన్ ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వెన్నువిరిచాడు. ఇంగ్లండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 400 ప‌రుగులు చేయ‌గా, టీమిండియా 631 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవ‌లం 195 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 36 ప‌రుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఇంగ్లండ్ ఆట‌గాళ్లలో సెకండ్ ఇన్నింగ్స్‌లో కుక్ 18, జెన్నింగ్స్ 0, రూట్ 77, అలీ 0, బ‌యిర్ స్టో 51, స్టోక్స్ 18, జేటీ బల్ 2, బ‌ట్ల‌ర్ 6, వోక్స్ 0, ర‌షీద్ 2, అండ‌ర్స‌న్ 2 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో ఇంగ్లండ్ కు మ‌రో 19 ప‌రుగులు వ‌చ్చాయి. భారత బౌలర్లలో అశ్విన్ 6, జడేజా 2 వికెట్లు తీయగా యాదవ్, కుమార్‌ల‌కు చెరో వికెట్ ల‌భించాయి.

అశ్విన్ ఖాతాలో ఇంకో రికార్డు...

ఇప్పటి్కే వేగంగా వికెట్లు తీస్తూ కొత్త కొత్త రికార్డులను నెలకొల్పుతున్న రవిచంద్రన్ అశ్విన్ మరో దానికి చేరువయ్యాడు. 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన రెండో భారత్ బౌలర్ గా నిలిచాడు. భారత్ నుంచి అశ్విన్ ఏడుసార్లు 10 వికెట్ల మార్కును చేరాడు.

భారత్ తరపున 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన బౌలర్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 8 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇంకా ఇంగ్లాండ్ తో ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండటం, ఆపై వెంటనే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో త్వరలోనే ఆ రికార్డు కూడా అశ్విని కనుమరుగు చేయటం ఖాయమైపోయినట్లే...

కోహ్లీ నామా సంవత్సరం..

ఎప్పుడైతే టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచే టీమిండియాను విజయ బాటలో తీసుకెళ్తున్నాడు స్టార్ బ్యాట్స్ మెన్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. వరుసగా ఐదో సిరీస్ ను కైవసం చేసుకోవటంతోపాటు, మూడు డబుల్ సెంచరీలతో ఈ యేడాది సెన్సేషన్ అయ్యాడు విరాట్. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Ravichandran Ashwin  Virat Kohli  

Other Articles