14 ఏళ్ల తరువాత.. వాంఖేడ్ లో టీమిండియా ఓపెనర్ శతకం.. opener Murali Vijay gets eighth test century

Murali vijay silences critics with eighth test ton

india vs england, ind vs eng, india england, india cricket team, murali vijay, vijay, murali vijay hundred, wankhede stadium, Murali Vijay, Opener, virender sehwag, Team India, England, cricket score, cricket news, cricket

critics questions were answered and doubts were cleared by Murali Vijay in the Mumbai Test, as he stroked eighth Test century and second of the series to put all doubts about his form to rest.

విమర్శకుల నోళ్లకు శతకంతో మురళీ విజయ్ తాళం

Posted: 12/10/2016 05:09 PM IST
Murali vijay silences critics with eighth test ton

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలిటెస్టు తొలిఇన్నింగ్స్లో శతకాన్ని నమోదు చేసినా.. ఆ తరువాత సిరీస్‌లోని మిగతా టెస్టులలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శకులు పెట్టిన ఎక్కులన్నింటికీ తన శతకంతో ఓపెనర్‌ మురళీ విజయ్‌పై సమాధానం చెప్పాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడటంతో అతనిపై విమర్శకులు తూటాలను సంధించారు. అయితే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనీల్ కుంబ్లే అతనికి మద్దతునిచ్చారు. అంతే ఇంకేముందు తనకున్న వెన్నదన్నుతో చెలరేగిపోయిన మురళీ విజయ్ ఏకంగా వాంఖేడ్ స్టేడియంలో శతకాన్ని నమోదు చేసి విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు.

231 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు పుజారాతో కీలక భాగస్వామ్యం నమోదు చేసిన విజయ్.. అజేయ అర్ధ సెంచరీతో రెండో రోజు ముగించాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన అతను ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పుజారాతో కలిసి రెండో రోజున 107 పరుగుల భాగస్వామ్యం చేసిన మురళీ విజయ్ ఆ తరువాత కెప్టెన్ కోహ్లీతో కలిసి ధాటిగా ఆడుతున్నాడు.

ఇదిలా ఉంచితే గత 14 ఏళ్లుగా టీమిండియా ఓపెనర్లు నుంచి శతకాన్ని చూడాలన్న వాంఖేడ్ స్టేడియంలోని ప్రేక్షకుల కలలు ఇవాళ సఫలీకృతమయ్యాయి. భారత ఓపెనర్ గా 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఇంత కాలానికి భారత ఓపెనర్ గా మురళీ విజయ్ ఆ మార్కును చేరాడు. కాగా, గడిచిన ఇరవై ఏళ్ల కాలంలో సెహ్వాగ్, మురళీ విజయ్ లు మాత్రమే భారత ఓపెనర్లుగా సెంచరీలు నమోదు చేసినవారు. ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మురళీ విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 231 బంతుల్లో8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  wankhede stadium  Murali Vijay  Opener  virender sehwag  Team India  England  cricket  

Other Articles