4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ Virat Kohli crosses 4,000 Test runs at Wankhede

Virat kohli crosses 4 000 test runs at wankhede

India vs England, virat kohli, sachin tendulkar, rahul dravid, Team india, fourth test, virender sehwag, 4000 test runs, 1000 runs in calender year, england vs india, ind vs eng, india england, score update, r ashwin, wriddhiman saha, Adil Rashid, India vs England score, cricket news, cricket

Virat Kohli gave crowd filled wankhede stadium viewers early cause for celebration when he crossed 41 to reach 4,000 career Test runs.

4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ

Posted: 12/10/2016 05:02 PM IST
Virat kohli crosses 4 000 test runs at wankhede

అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా క్రికెట్ విరాట్ కోహ్లీ ఇవాళ తన కెరీర్ లోనే చిరస్మరణీయ రోజుగా మలుచుకున్నాడు. తన క్రికెట్ కెరీర్ లోనే మూడు అరుదైన ఘనతలను అందుకుని రెట్టించిన వేగంతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ రికార్డుతో ఆయన గత కెప్టెన్లు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, ది గ్రేట్ వాల్ గా పేరోందిన రాహుల్ ద్రావిడ్ లతో పాటు మరో లెజండరీ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ సరసన చేరారు. పరుగుల దాహంతో చెలరేగిపోతున్న కోహ్తీ.. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులను పూర్తి చేసి.. ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్ గా నిలిచాడు.

విరాట్ సాధించిన వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్ ల్లో 17 వ ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ మార్కును చేరాడు. ఒక క్యాలెండర్ ఇయర్ వెయ్యి పరుగులు సాధించే క్రమంలో విరాట్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 211. ఇక మరోవైపు మంచి ఫామ్ లో వున్న విరాటుడు 41 పరుగులను సాధించగానే తన టెస్టు క్రికెట్ లో నాలుగు వేల పరుగుల మైలురాయికి కూడా అందుకున్నాడు. 52 టెస్టు మ్యాచ్ లలో ఈ రికార్డును అందుకున్న కోహ్లీ 14వ టీమిండియా బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.

ఇక మరోవైపు ఒక సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్ గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్ లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. ఇప్పటివరకూ ఈ ఫీట్ ను గవాస్కర్ మాత్రమే రెండుసార్లు సాధించాడు. 1978-79 సీజన్ లో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేయగా,1981-82 సీజన్ లో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించాడు.

రెండో శనివారం సందర్భంగా ముంబైలోని వాంఖేడ్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసి పోయిన సందర్బంగా వారందరికీ కోహ్లీ సాధించిన వెయ్యి, నాలుగు వేల పరుగులతో పాలు సిరీస్ లో ఐదు వందల పరుగులను సాధించి జోష్ నింపాడు. ఇదిలా ఉండగా ఒక ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ ముందంజలో ఉన్నాడు. 2010లో సచిన్ 1562 పరుగులను చేశాడు. ఆ తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. 2010లో సెహ్వాగ్ 1422 పరుగులు నమోదు చేశాడు. ఆ తరువాత కెప్టెన్ గా ఈ రికార్డును సొంతం చేసుకున్న వారిలో2006వ సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్ కూడా వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  virat kohli  sachin tendulkar  rahul dravid  virender sehwag  england  Team india  cricket  

Other Articles