టీమిండియాతో వన్డే సిరీస్ కు మోర్గాన్ రెడీ Morgan returns to lead England in ODI series

Morgan hales back in england squads for india tour

England ODI squad,England t20 squad,india series,India vs England,Eoin Morgan,Alex Hales,Ben Duckett,India vs England T20 series,limited-overs squads,Eoin Morgan Alex Hales Bangladesh

Captain Eoin Morgan and opening batsman Alex Hales have been named in the England squads for next month's one-day and Twenty20 series in India.

టీమిండియాతో వన్డే సిరీస్ కు మోర్గాన్ రెడీ

Posted: 12/06/2016 08:57 PM IST
Morgan hales back in england squads for india tour

టీమిండియాతో టూర్ కు ముందు బంగ్లాదేశ్ జట్టులో జరిగే సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో తాను కొనసాగలేనని, స్వచ్చంధంగా తప్పుకున్న ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ణ ఇయాన్ మోర్గన్.. జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. టీమిండియాతో వచ్చే ఏడాదిలో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు మోర్గాన్ తిరిగి జట్టులో స్థానం సంపాదించారు. ఈ మేరకు జట్టు వివరాలను ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనను టీమిండియాతో వన్డే సిరీస్ కు ఎంపిక చేసింది. దాంతోపాటు ఇంగ్లండ్  ..వన్డే జట్టు, టీ 20 కెప్టెన్గా మోర్గాన్ పేరును ఖరారు చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

బంగ్లాదేశ్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మోర్గాన్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దాంతో ఇంగ్లండ్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలను జాస్ బట్లర్కు అప్పగించాల్సి వచ్చింది. ప్రస్తుతం మోర్గాన్ జట్టుకు అందుబాటులోకి రావడంతో అతనే వన్డే,టీ 20 కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బట్లర్తో పాటు అలెక్స్ హేల్స్లు వన్డే, టీ 20 జట్టులో కలవనున్నారు. మరొకవైపు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టు నుంచి విశ్రాంతినిచ్చిన జో రూట్ ను  భారత్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేశారు.ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టులో రూట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ వన్డే జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్ స్టో, జాక్ బాల్, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, డావసన్, హేల్స్, ప్లంకెట్, అదిల్ రషిద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eoin morgan  Alex Hales  england  india  one day series  

Other Articles