నాల్గో టెస్టులో అడేందుకు పార్థివ్ కు లైన్ క్లియర్ Parthiv Patel set to play in fourth Test

Parthiv patel set to play in fourth test injured saha rested

parthiv patel, wicket keeper, wankhede, Team India, india vs england, ind vs eng, parthiv patel, india vs england mumbai test, india vs england test series, wriddhiman saha, wriddhiman saha injury, cricket news, sports news

Parthiv Patel's lucky break with the Indian Test team got an extension when he was confirmed as the wicketkeeper for the fourth Test against England

నాల్గో టెస్టులో అడేందుకు పార్థివ్ కు లైన్ క్లియర్

Posted: 12/06/2016 06:25 PM IST
Parthiv patel set to play in fourth test injured saha rested

సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో మరో రెండు రోజుల్లో ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగనున్న నాల్గో టెస్టులో భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కొనసాగనున్నాడు. అనూహ్యంగా జట్టులో స్థానాన్ని సంపాదించిన పార్థివ్.. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తన సత్తా చాటడంతో నాల్గో టెస్టులోనూ అతను ఆడేందుకు లైన్ క్లియరైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో పార్థీవ్ ను నాల్గో టెస్టులో ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు.

మూడో టెస్టు ముగిసిన వెంటనే పార్థివ్ ను రిజర్వు ఓపెనర్ గా కోనసాగిస్తామంటూ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడినట్లుగానే అతను నాల్గో టెస్టులో అడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మొహాలీలో మూడో టెస్టుకు ముందు సాహా గాయపడిటంతో అందుబాటులో వుండాల్సిన రిషబ్ పంత్ కూడా అనుకోకుండా అందుబాటులోకి రాకపోవడంతో అనూహ్యంగా పార్థీవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ అవకాశాన్ని పార్థీవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జట్టులో పునరాగమనం చేసిన పార్థీవ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నాల్గో టెస్టులో ఆడనున్నాడు. అతను గాయం నుంచి తిరిగి కోలుకోవడంతో జట్టులో ఎంపికయ్యాడు. నాల్గో టెస్టులో మురళీ విజయ్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఆ క్రమంలోనే పార్థీవ్ టాపార్డర్లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parthiv patel  wicket keeper  wankhede  Team India  India vs England  Cricket  

Other Articles