వైరల్ వీడియో: గల్లీ క్రికెట్ అడిన గంగూలీ Ganguly Plays Gully Cricket In The Streets Of Kolkata

Sourav ganguly plays gully cricket in the streets of kolkata

Sourav Ganguly, Ganguly Plays Gully Cricket, Dada of Gully Cricket, ganguly playing cricket on streets, Streets Of Kolkata, sourav ganguly, ganguly, Sourav Ganguly, team india, president of CAB, Cricket Association of Bengal, gully cricket, Kolkata Cricket

The former Indian skipper, Sourav Ganguly, took time out of busy schedule as the president of Cricket Association of Bengal (CAB) to show-off his gully cricket skills in streets of Kolkata.

వైరల్ వీడియో: గల్లీ క్రికెట్ అడిన గంగూలీ

Posted: 12/04/2016 05:01 PM IST
Sourav ganguly plays gully cricket in the streets of kolkata

ఆ క్రికెట్‌ దాదా మళ్లీ బ్యాట్ పట్టాడు. గల్లీ క్రికెట్ అడాడు. ఇదేదో బ్రహ్మానందం ఏదో చిత్రంలో గచ్చిబౌలి దివాకరం క్యారెక్టర్ కోసం జరిగిన సినిమా షూట్ కాదు. తాను ఫామ్ లో వున్నప్పుడు ఏకంగా టీమిండియా జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చిన దాదా. అతనెవరూ అని అలోచనలో పడ్డారా.? అతను మరెవరో కాదు టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తరువాత ఇటు క్యాబ్ తో పాటు అటు బిసిసిఐలో పలు కీలక బాధ్యతలతో బిజీగా వున్న గంగూలీ.. గల్లి క్రికెట్ అడారా..?

ఇదేగా మీ అనుమానం.. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ.. తీరిక దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు గంగూలీ గల్లీ క్రికెట్ అడతాడట. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని మరీ తన గల్లీలోని చిన్నపిల్లలతో కలసి గల్లీ క్రికెట్ అడతాడట. పనిలో పనిగా చిన్నపిల్లలకు బ్యాటింగ్ మెలకువలు కూడా నేర్పించి.. తన ఆటతో వారిలో ఉత్తేజాన్ని కూడా రేపుతాడట. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దాదా రిటైరయిపోయి అప్పుడే ఎనిమిదేళ్లు పూర్తైనా.. తనలో క్రికెట్ పై వున్న మక్కువకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.

అయినా గంగూలీకి క్రికెట్‌ అంటే మక్కువ తగ్గలేదు. అందుకే ఈడెన్‌ గార్డెన్స్‌లోనే కాదు తీరిక దొరికితే ఉత్తర కోల్‌కతాలోని ఇరుకు సందుల్లోనూ దాదా క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తాడు. తాజాగా ఇలాగే గల్లీ క్రికెట్‌ ఆడుతూ గంగూలీ కనిపించాడు. పిల్లలతో కలిసి దాదా ఆడిన ఈ గల్లీ క్రికెట్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గల్లీ క్రికెట్‌లోనూ గంగూలీ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లు కొట్టాడు. ఇంతలో ఓ బాల్‌ దూసుకొచ్చి ఆయన భుజానికి గట్టిగా తాకింది. మామూలు టెన్నిస్‌ బంతి కావడంతో పెద్దగా గాయమేమీ కాలేదు. కాసేపు చేయి రాసుకొని మళ్లీ గంగూలీ క్రికెట్‌ కొనసాగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles