విరాట్ కోహ్లీని ఆ క్రికెటర్ అధిగమించేశాడోచ్.. Steve Smith overtakes virat kohli's odi records

Steve smith overtakes virat kohli s odi records

Australia vs New Zealand 2016,Australian Cricket,New Zealand Cricket,David Warner,Steven Smith,Martin Guptill,Ricky Ponting,Aaron Finch,Cricket'> Ponting,Aaron Finch,Cricket

Steve Smith's average in home ODIs since 2015 is the best of any batsman in the world. He has scored 1,103 runs at an average of 78.78, with Virat Kohli second on this list with an average of 75.37.

విరాట్ కోహ్లీని ఆ క్రికెటర్ అధిగమించేశాడోచ్..

Posted: 12/04/2016 04:17 PM IST
Steve smith overtakes virat kohli s odi records

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన క్రికెటర్. జట్టుకు విజయాలు అందించడంతో పాటు పరుగుల దాహంతో చెలరేగిపోతున్న ఆటగాడు కోహ్లీ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. క్రికెట్ దేవుడిగా ఇప్పటికీ అభిమానుల అధరాభిమానాన్ని సంపాదించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఒకే ఒక్క వారుసుడిగా మన్ననలు అందుకుంటున్న కోహ్లీ.. ఇప్పటికే కొన్ని రికార్డుల పరంగా చాలా ఎత్తులో ఉన్నాడు. అయితే గత రెండేళ్లలో స్వదేశంలో జరిగిన వన్డే సగటులో ఇప్పటివవరకూ విరాట్ ముందంజలో ఉండగా, ఆ రికార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్  సవరించాడు.

న్యూజిలాండ్ తో  వన్డే మ్యాచ్లో స్వదేశీ యావరేజ్ పరంగా స్మిత్ ముందు వరుసలోకి వచ్చేశాడు. 2015-16 సీజన్ నుంచి చూస్తే16వ ఇన్నింగ్స్ ఆడుతున్న స్మిత్.. 4 సెంచరీలు. 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసి వెయ్యికి పైగా పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తో వన్డేలో స్మిత్ శతకం సాధించాడు. ఇక్కడ స్మిత్ యావరేజ్ 79.23 కాగా, స్ట్రైక్ రేట్ 95.37 గా ఉంది. ఇది స్వదేశంలో జరిగిన వన్డేల్లో అత్యధిక యావరేజ్గా నమోదైంది.

ఈ కాలంలో స్వదేశంలో విరాట్ 10 వన్డే ఇన్నింగ్స్లు ఆడి రెండు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 603 పరుగులు చేశాడు. దీనిలో భాగంగానే 75.37 సగటును, 94.81 స్ట్రైక్ రేట్ను సాధించాడు. కాగా, న్యూజిలాండ్ తో వన్డేలో దాన్ని స్మిత్ అధిగమించాడు. మరొకవైపు వన్డేల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఈ మార్కును చేరిన తొలి ఆటగాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  steve smith  sachin tendulkar  ricky ponting  australia  India  cricket  

Other Articles