అసియా కప్ టీ 20: ఫాకిస్థాన్ పై టీమిండియా ఘనవిజయం India defeat Pakistan to win Womens T20 Asia Cup trophy

India beat pakistan to win women s twenty20 asia cup title

harmanpreet kaur, mithali raj, smriti mandhana, bangkok, cricket, Womens Asia Cup T20, India, Pakistan, India vs Pakistan, Mithali Raj, Cricket, Harmanpreet Kaur, Women’s Twenty20 Asia Cup

Mithali Raj’s magnificent unbeaten 73 and a combined bowling effort from Jhulan Goswami, Ekta Bisht and Preeti Bose helped India win the Women’s Asia Cup T20 title against Pakistan by 17 runs in Bangkok.

అసియా కప్ టీ 20: ఫాకిస్థాన్ పై టీమిండియా ఘనవిజయం

Posted: 12/04/2016 02:53 PM IST
India beat pakistan to win women s twenty20 asia cup title

మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన తుదిపోరులో పాకిస్తాన్పై భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సాధించింది. భారత్ విసిరిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడి ఓడింది. పాక్ క్రీడాకారిణుల్లో అయేషా జాఫర్(15),జావిరియా ఖాన్(22), బిస్మా మరూఫ్(25) ఫర్వాలేదనిపించినా, మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

దాదాపు పది ఓవర్ల వరకూ మ్యాచ్ పాక్ వైపు మొగ్గగా, చివరి ఓవర్లలో భారత్ పైచేయి సాధించి గెలుపును సొంతం చేసుకుంది. చివరి రెండు ఓవర్లలో పాకిస్తాన్ 32 పరుగులు చేయాల్సి రావడంతో అది వారికి కష్ట సాధ్యంగా మారింది. పాకిస్తాన్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా,అనూజా పటేల్,జులాన్ గోస్వామి, శిఖా పాండే,ప్రీతి బోస్లకు తలో వికెట్ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మిథాలీ రాజ్ ( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకుంది. మరోవైపు మిథాలికీ జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించి జట్టును కాపాడింది. భారత మిగతా క్రీడాకారిణుల్లోమందనా(6),మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Womens Asia Cup T20  India  Pakistan  India vs Pakistan  finals  cricket  

Other Articles