అసియా కప్ టీ 20: ఫైనల్ లో ఫాకిస్థాన్ తో తలపడుతున్న భారత్ India, Pakistan renew rivalry in Asia Cup T20 final

India pakistan face off in women s asia cup t20 final

harmanpreet kaur, mithali raj, smriti mandhana, bangkok, cricket, Womens Asia Cup T20, India, Pakistan, India vs Pakistan, Mithali Raj, Cricket, Harmanpreet Kaur, Women’s Twenty20 Asia Cup

An Advocate from hyderabad shanker matt accidentally dropped his new Rs.500 note, who removed and noticed few letters lost.

అసియా కప్ టీ 20: ఫైనల్ లో ఫాకిస్థాన్ తో తలపడుతున్న భారత్

Posted: 12/03/2016 08:24 PM IST
India pakistan face off in women s asia cup t20 final

మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంట్ తుది పోరులో భారత్తో పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే భారత్ మహిళలు ఫైనల్ కు చేరగా, మరో బెర్తు ఖరారు కోసం చివరి లీగ్ మ్యాచ్ వరకూ వీక్షించాల్సి వచ్చింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్పై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది.  తొలుత థాయ్లాండ్ను 51 పరుగులకే కూల్చేసిన పాకిస్తాన్.. ఆ తరువాత లక్ష్య ఛేదనలో ఐదు వికెట్ల మాత్రమే కోల్పోయి  11.4 ఓవర్లలో గెలుపొందింది.

స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు అయేషా జాఫర్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, బిస్మా మరూఫ్(4) నిరాశపరిచింది. ఆపై అస్మావియా ఇక్బాల్(24), నిదా దార్(14)లు పరిస్థితిన చక్కదిద్దారు. మూడో వికెట్ కు 31 పరుగులు జోడించి పాక్ కు విజయాన్ని ఖరారు చేశారు. ఈ టోర్నీలో భారత్ ఐదు వరుస విజయాలతో ఫైనల్ కు చేరగా, పాకిస్తాన్ నాలుగు విజయాలతో తుది పోరుకు చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Womens Asia Cup T20  India  Pakistan  India vs Pakistan  finals  cricket  

Other Articles