కెప్టెన్ ధోని మ్యాజిక్ రనౌట్.. మ్యాచ్‌కే హైలైట్ 'magical' MS Dhoni's stunning act to run out Ross Taylor

Magical ms dhoni s stunning act to run out ross taylor

ms dhoni, ms dhoni run out, ms dhoni run out video, dhoni run out video, ms dhoni ross taylor run out, dhoni taylor run out, dhoni run out video, sports

MS Dhoni's magic with the gloves continues in India vs New Zealand 4th ODI match 2016, MS Dhoni best stumping without looking at the wicket run out Ross Taylor in Ranchi.

కెప్టెన్ ధోని మ్యాజిక్ రనౌట్.. మ్యాచ్‌కే హైలైట్

Posted: 10/27/2016 12:22 PM IST
Magical ms dhoni s stunning act to run out ross taylor

పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో రాంఛీ వేదకగా సాగిన నాల్గవ వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు.. గుప్తిల్ ఔట్ అయ్యేవరకు భారీ స్కోరు దిశగా సాగినా.. ఆ తరువాత క్రమంగా పెవీలియన్ బాటపట్టింది. అయితే విధ్వంసకర బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ క్రీజులో వుండగా, స్కోరు బోర్డు సింగిల్స్, డబుల్స్ సహా మధ్యమధ్యలో చెత్త బంతులను బండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును కూడా కదించేవాడు.

అయితే రాస్ టేలర్ ను ఔట్ చేయాలని పథకం వేసిన కెప్టెన్, టీమిండియా బౌలర్లకు చిక్కకుండా తన బ్యాట్ తో పరుగులను సాధిస్తూ ముందుకెళ్తున్న టేలర్ ను ధోని పెవీలియన్ కు పంపాడు. అది కూడా గుడ్డిగా. అదెలా అంటారా.. ఇన్నింగ్స్ లోని 46వ ఓవర్లో ఉమేష్ వేసిన బంతిని పైన్ లెగ్ దిశగా అడిన టేలర్ రెండు పరుగులు తీసేందుకు వేగంగా పరిగెత్తి ఒక పరుగును పూర్తి చేసి రెండో పరుగు కోసం మెరుపు వేగంతో వస్తున్నాడు. అదే సమయంలో ధావల్ విసిరిన త్రో ను అందుకునేందుకు ముందుకువచ్చిన ధోని వెనక్కి తిరిగి చూడకుండా దానిని అదే వేగంతో వికెట్లపైకి విసిరాడు.

బంతి స్టంప్స్‌కు తగలడం, టేలర్ రనౌట్ కావడం.. పలు కోణాల్లోని కెమెరాల రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించడం.. చకచకా జరిగిపోయాయి. గతంలోనూ ధోని కొన్నిసార్లు ఇలా బంతిని పూర్తిగా అందుకోకుండా వికెట్ల పైకి మళ్లించిన ఘటనలు ఉన్నాయి.. అయితే ఈసారి వికెట్లకు కొంత దూరంగా వుండి కూడా ధోని సరిగ్గా వికెట్లకు తగిలేలా బంతిని విసరగలగడం మ్యాజిక్ గా పేర్కోంటున్నారు అభిమానులు. ఇంకోందరు మాత్రం వికెట్ల వెనకు సూపర్ మ్యాన్ అని, మరికోందరు జార్ఖండ్ డైనమైట్ సేలిందని.. ధోనీపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  ms dhoni  ross taylor  cricket  

Other Articles