ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో.. టీమిండియా టాప్ ప్లేస్.. Ravichandran Ashwin leads bowlers chart in icc test rankings

Icc test rankings india stays no 1 team ravichandran ashwin leads bowlers chart

Team India, Ashwin, ICC Test rankings, top bowlers, cricket, test cricket, top bowlers, top batsman, top allrounders, cricket, cricket

The Indian cricket team and its premier spinner Ravichandran Ashwin held on to their numero uno status in the latest ICC Test rankings

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో.. టీమిండియా టాప్ ప్లేస్..

Posted: 10/26/2016 06:43 PM IST
Icc test rankings india stays no 1 team ravichandran ashwin leads bowlers chart

న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్ లో ఐదు టెస్టులను గెలచి అలవోకగా పర్యాటక జట్టుపై పైచేయిని సాధించిన టీమిండియా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. అంతకుముందు ఈ స్థానంలో వున్న పాకిస్థాన్ నుంచి భారత్ క్రికెటర్లు అగ్రస్థానాన్ని లాగేసుకున్నారు. బౌలర్ల జాబితాలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ తాజా జాబితాను బుధవారం ఐసీసీ విడుదల చేసింది.

భారత్ 115 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ (111), ఆస్ట్రేలియా (108) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి. జింబాబ్వేతో జరుగనున్న టెస్టు సిరీస్ లో శ్రీలంక రెండు టెస్టు మ్యాచ్ లను గెలిస్తే తన అరవ స్థానాన్ని పధిలం చేసుకోవచ్చు. లేని పక్షంలో ర్యాంకు దిగజారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కాగా టాప్ 10 స్థానాలలో భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే మాత్రమే కోనసాగుతున్నాడు. 825 పాయింట్లతో ఆయన అరవ స్తానంలో కోనసాగుతున్నాడు. ఇక పూజరా, కెప్టెన్ కోహ్లీలు వరుసగా 15, 17వ స్థానాల్లో నిలిచారు.

న్యూజిలాండ్తో సిరీస్లో రాణించిన 200 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్స్టర్ డేల్ స్టెయిన్, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్లో ఉండగా, మరో భారత స్పిన్నర్ జడేజా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే పాకిస్థాన్ కు చెందిన వెటరన్ క్రికెటర్ యూనిస్ అనూహ్యంగా రెండవ స్థానానికి ఎగబాకి అందరినీ అశ్చర్యపర్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Ashwin  ICC Test rankings  top bowlers  cricket  

Other Articles