ధోనిని కుంబ్లే కంటిన్యూ చేయిస్తారని అశిస్తున్నా: గంగూలీ Dhoni's move to Number 4 could be a new beginning

Cricket is not rocket science india need ms dhoni at no 4 sourav ganguly

virat kohli, Sourav Ganguly, Anil kumble, ms dhoni, india, teamindia, new zealand, india vs new zealand, ind vs nzl, ind vs nzl mohali, sports, sports news, cricket

After his Mohali blockbuster, the Indian cricket fraternity has urged Mahendra Singh Dhoni to stick to No.4 spot in ODIs.

ధోనిని కుంబ్లే కంటిన్యూ చేయిస్తారని అశిస్తున్నా: గంగూలీ

Posted: 10/25/2016 06:26 PM IST
Cricket is not rocket science india need ms dhoni at no 4 sourav ganguly

మొహాలీ వేదికగా పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులను అశ్చర్యంలో ముంచిన క్రికెటర్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మూడో వన్డేతో తిరిగి ఫామ్ లోకి వచ్చి తన దూకుడును ప్రదర్శించిన దోణిపై అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు క్రికెట్ అభిమానులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఆయను ప్రశంసించారు. మూడో వన్డే మ్యాచ్ నేపథ్యంలో కోచ్ అనీల్ కుంబ్లే మహేంద్రసింగ్ ధోనిని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కోన్నారు.

అదేంటి ఆయనే కెప్టెన్ గా కోనసాగుతున్నాక.. మంచి ప్రదర్శనతో ఫామ్ లోకి వచ్చాక అయనను కంటిన్యూ చేస్తారని అశించడమేంటని సందేహమే వద్దు. మేము చెప్పేంది కుంబ్లే ధోనిని నాల్గవ స్థానంలో కంటిన్యూ చేయిస్తారని. ఇదే విషయాన్ని గంగూలీ కూడా అశిస్తున్నారు. ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ అనేది రాకెట్ సైన్స్ కాదని, అత్యుత్తమ బ్యాట్స్మన్ అనేవాడు ఎక్కువ బంతుల్ని ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడమేనన్నాడు.

న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదే పని చేసి సక్సెస్ అయ్యాడన్నాడు. అయితే ధోని నాల్గో స్థానంలోనే బ్యాటింగ్ కు వస్తాడా?లేదా?అనేది తనకు తెలీదన్నాడు. కాకపోతే ఆ స్థానంలో ధోని బ్యాటింగ్ కు వస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నట్లు దాదా పేర్కొన్నాడు. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ధోని నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని అనుకుంటున్నానన్నాడు.

ఈ విషయాన్ని ధోనికి జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే చెబుతాడని ఆశిస్తున్నాట్లు కూడా చెప్పాడు. ఆ ఆర్డర్లో ధోని బ్యాటింగ్కు వస్తే అతనికి సౌకర్యవంతంగా ఉంటుంది. మ్యాచ్లు చూసే ప్రజలకి బాగుంటుంది''అని గంగూలీ తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ను ధోని ఎంతకాలం ఆడతాడు అనేది తనకు తెలియనప్పటికీ, అత్యుత్తమ ప్రదర్శనలు మాత్రం అతనికి అవసరమని గంగూలీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  MS Dhoni  Sourav Ganguly  Anil kumble  cricket  

Other Articles