సచిన్ రికార్డులను అధిగమించనున్న కోహ్లీ.. Virat Kohli equals Sachin Tendulkar's record

Virat kohli equals sachin tendulkar s record

virat kohli, ms dhoni, sachim tendulkar chasing record, virat kohli chasing record, jimmy neesham, india vs new zealand, india vs new zealand 3rd odi, india vs new zealand mohali, mohali odi, cricket news, sports news

Virat Kohli's 151 run stand with MS Dhoni is the first century partnership for the third wicket for India in ODIs at Mohali.

సచిన్ రికార్డులను అధిగమించనున్న కోహ్లీ..

Posted: 10/24/2016 06:33 PM IST
Virat kohli equals sachin tendulkar s record

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ఛేజింగ్ లో తన సూపర్ సెంచరీలతో 14 సార్లు భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆ రికార్డును సమం చేశాడు. పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో మొహాలీ వేదికగా జరిగిన మూడవ వన్డేలో కోహ్లీ 154 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 26 సెంచరీలు పూర్తి చేశాడు. ఇక రికార్డ్ విషయానికొస్తే... ఛేజింగ్ లో కోహ్లీ 16 సెంచరీలు చేయగా, ఇండియా 14 సార్లు గెలిచింది. దీంతో ఛేజింగ్ లో శతకాలు నమోదు టీమిండియాకు విజయాలను అందించిన రికార్డులలో కోహ్లీ సచిన్ సరసన నిలిచాడు.

కాగా చేజింగ్ లో మరో శతకాన్ని నమోదు చేసిన పక్షంలో విరాట్ ఛేజింగ్ శతకాల జాబితాలోనూ సచిన్ సరసన నిలుస్తాడు. అయితే మరో శతకంతో భారత్ కు విజయాన్ని  అందిస్తే.. టీమిండియాకు విజయాలందించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ రికార్డులను కూడా అధిగమిస్తాడు. ఇక చేజింగ్ లో మరో రెండు శతకాలను నమోదు చేస్తే చేజింగ్ లో అత్యధిక శతకాలను నమోదు చేసిన టీమిండియా క్రికెటర్ గా కూడా చరి్త్ర పుటలకు ఎక్కనున్నాడు విరాటుడు. ఛేజింగ్ లో ఇప్పటి వరకు 58 ఇన్నింగ్స్ లో కోహ్లీ 3514 పరుగులు చేశాడు. వీటిలో 14 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  Team India  virat kohli  sachin tendulkar  cricket  

Other Articles