పైచేయికోసం టీమిండియా.. ఉత్సాహంతో కివీస్.. గెలుపెవరిదీ.? India eyeing improved show against reinvigorated New Zealand

India eyeing improved show against reinvigorated new zealand

Mohali ODI, Virat Kohli, Suresh Raina, MS Dhoni, Kane Williamson, Indian vs New Zealand, ind vs nzl mohali, ind vs nzl, india vs new zealand third odi, ind vs nzl third odi, India, new zealand, Cricket, sports

Stung by an improved New Zealand the other night, a wary India would like to quickly get their house in order when they square off with Kane Williamson's boys in the third ODI

పైచేయికోసం టీమిండియా.. ఉత్సాహంతో కివీస్.. గెలుపెవరిదీ.?

Posted: 10/22/2016 06:58 PM IST
India eyeing improved show against reinvigorated new zealand

పంజాబ్ లోని మోహాలీ స్టేడియం వేదికగా ఐదు వన్డేల సిరీస్లో భాగంగా పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో మరో మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ లోనూ అలాగే ప్రణాళికలే రచించినా అది కాస్తా గతి తప్పింది. ఫిరోజ్ షా కోట్లా మైదనాంలో జరిగిన రెండో వన్డేలో కివీస్ గెలుపోందారు. దీంతో ఇక నుంచి జాగ్రత్తాగా అడి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా క్రికెటర్లు భావిస్తున్నారు. కాగా రెండో వన్డే గెలిచిన అనందంలో మునిగి తేలుతున్న న్యూజీలాండ్.. అదే ఉత్సాహంతో మూడో వన్డేలోనూ విజయాన్ని అందుకోవాలని ఉబలాటపడుతుంది. దీంతో ఇరు జట్ల మధ్య  జరిగనున్న మూడో వన్డేలో మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.

గత మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు భారత్  తొలి రెండు వన్డేల్లో కొనసాగించిన తుది జట్టుతోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా అరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో మూడో వన్డేకు కూడా అయన అందుబాటులోకి రాలేదు. దాంతో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మంచి టచ్ లోకి వచ్చాడు.

ఇదిలావుండగా, మొహాలీలో భారత్ జట్టు మంచి వన్డే రికార్డును కల్గి వుంది. ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పీసీఏ)లో ఇప్పటివరకూ భారత్ ఓవరాల్ గా 13 వన్డేలు ఆడగా, ఎనిమిదింట విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఇక్కడ ఆస్ట్రేలియాతో చివరిసారి  ఆడిన వరల్డ్ టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohali ODI  Virat Kohli  MS Dhoni  Kane Williamson  Indian vs New Zealand  cricket  

Other Articles