సచిన్, ద్రావిడ్ ల రిక్డార్డును బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్ Younis Khan కేుచ most Test centuries after the age of 35

Younis khan breaks record for most test centuries after the age of 35

Pakistan vs West Indies 2016, Pakistan Cricket, Younis Khan, Sachin Tendulkar, Rahul Dravid, Graham Gooch, england, India, Pakistan, Cricket, sports

Younis Khan broke the record for most Test centuries after the age of 35 courtesy of his century in the second Test against West Indies at Abu Dhabi.

సచిన్, ద్రావిడ్ ల రిక్డార్డును బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్

Posted: 10/22/2016 05:39 PM IST
Younis khan breaks record for most test centuries after the age of 35

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఇన్నాళ్లు పధిలంగా వున్న భారత దిగ్గజ ఆటగాళ్ల రికార్డు బద్ధలైంది. భారత్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా గ్రేట్ వాల్ గా ఖ్యాతిచెందిన రాహుల్ ద్రావిడ్ లు తమ కెరీర్లో ముప్ఫై ఐదు ఏళ్ల తరువాత నమోదు చేసిన టెస్టు సెంచరీలను పాకిస్థాన్ ఆటగాడు బ్రేక్ చేశాడు. తాజాగా ఆ రికార్డును పాకిస్తాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ అధిగమించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో 35 ఏళ్ల తరువాత అత్యధికంగా టెస్టు శతకాలు నమోదు చేసి గతంలో ఈ అంశంలో నమోదైన రికార్డులను బద్దలు కోట్టాడు.

వెస్టిండీస్ తో అబుదాబి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ ఆ రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్లో యూనిస్ శతకం చేయడంతో 35 ఏళ్ల తరువాత అత్యధికంగా 13 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం 39వ ఒడిలో ఉన్న యూనిస్.. ఓవరాల్ గా అతని  టెస్టు కెరీర్లో 32 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. వచ్చే నెల్లో బర్త్ డే జరుపుకోబోతున్న యూనిస్ మరో రికార్డుకు నెలకొల్పాడు.

పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ తో కలిసి ఆ దేశ టెస్టు క్రికెట్లో అత్యధిక భాగస్వామ్య పరుగులు సాధించాడు. ఈ జోడి ఇప్పటివరకూ 3156 టెస్టు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. అయితే ఇప్పటి వరకు 35 ఏళ్ల తరువాత అత్యధిక శతకాలు నమోదు చేసిన వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్తో కలిసి రాహుల్, సచిన్లు వున్నారు. తాజా సెంచరీతో యూనస్ ఖాన్ కూడా ప్రస్తుతం ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Younis Khan  sachin tendulkar  rahul dravid  england  India  Pakistan  cricket  

Other Articles