ఏ ఒక్కరూ రాణించలేదు.. అందుకే ఓటమి Mahendra Singh Dhoni blasts batsmen after Kotla defeat

Mahendra singh dhoni blasts batsmen after kotla defeat

MS Dhoni, ferozshah kotla, new zealand, team india, india vs new zealand, ndia virat kohli, gautam gambhir, Gautam Gambhir on Virat Kohli, India, India vs New Zealand 2016, news, google news, sports news, sports, cricket

Dhoni said losing wickets against the run of play was the sole reason behind India's six-run defeat to New Zealand in the second ODI

ఏ ఒక్కరూ రాణించలేదు.. అందుకే ఓటమి

Posted: 10/21/2016 05:37 PM IST
Mahendra singh dhoni blasts batsmen after kotla defeat

ఢిల్లీలోని ఫెరోజ్ షా కోట్ల మైదానం వేదికగా పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తమ జట్టులోని ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా సరిగా రాణించకపోవడయే కారణంగానే పరాజయాన్ని చవిచూశామని టీమిండియా లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అయన ఈ మ్యాచ్ లో జట్లులోని ఏ బ్యాట్స్ మెన్ కూడా అశించిన స్థాయిలో రాణించలేదన్నాడు.

తమ జట్టులోని బ్యాట్స్ మెన్ల మద్య దీర్ఘకాల భాగస్వామ్యాలు నమోదు కాకపోవడం కూడా ఓటమి కారణమని అన్నారు. కొన్ని బాగస్వామ్యాలు నమోదైనా, ఆవి ఎక్కువ సమయం నిలబడే క్రమంలో వికెట్లు కోల్పోవడం కూడా ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు. అయితే సమిష్టిగా బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతోనే తాము ఫిరోజ్ షా కోట్ల మైదానంలోని మ్యాచ్ లో పరాజయం పోందామన్నారు. ఓటమి ఫలానా బ్యాట్స్మెన్ కారణమంటూ ఎవరి పేరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. అయితే 41వ ఓవర్లో రెండు వికెట్లను కోల్పోవడం మ్యాచ్ పై పట్టుకోల్పోయినట్లు తెలిపాడు.

'మ్యాచ్ ను పరిశీలించి చూడండి. పలు కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాం. ఆపై వెంటనే వికెట్లను కోల్పోయాం. ఈ తరహా స్కోరు బోర్డుపై ఉన్నప్పుడు వికెట్లను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా చేస్తే పరుగులు అవే వస్తాయి. వికెట్లు చేతిలో ఉంటే ఓవర్ కు ఆరు, ఏడు పరుగులు సాధించడం అంత కష్టమేమీ కాదు. మా ఓటమికి ప్రధాన కారణం మాత్రం స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోవడమే. ఇది ఒక్క బ్యాట్స్మెన్ను ఉద్దేశించి చెప్పడం లేదు. మొత్తం జట్టంతా బ్యాటింగ్ లో వైఫల్యం చెందింది. నేను జట్టు గెలుపుకోసం 10 శాతం మించి కృషి చేశానని ఏ ఒక్క బాట్య్మెన్ అయినా చెప్పగలడా?' అని ధోని ప్రశ్నించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  ferozshah kotla  new zealand  team india  india vs new zealand  cricket  

Other Articles