గంభీరుడే.. ఇలా చలించిపోయిన గౌతముడు.. 'Ambitious' Gambhir as excited as debutant after India recall

Ambitious gambhir as excited as debutant after india recall

Gautam Gambhir, KL Rahul, India vs New Zealand, Eden Gardens india, new zealand, Team India, india vs new zealand,india vs new zealand score, india vs new zealand match, india vs new zealand kanpur, india vs new zealand match updates, virart kohli, india vs new zealand match latest news, india, cricket, cricket news, sports, sports news

Gautam Gambhir was recalled into the Indian side to replace an injured Lokesh Rahul for the second Test against New Zealand at the Eden Gardens in Kolkata, starting September 30.

గంభీరుడే.. ఇలా చలించిపోయిన గౌతముడు..

Posted: 09/28/2016 05:13 PM IST
Ambitious gambhir as excited as debutant after india recall

ఫామ్ కోల్పోయిన తరుణంలో జాతీయ జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్ లో తన అద్భుత ప్రతిభను కనబర్చిన తరువాత కూడా న్యూజీలాండ్ తో జరిగిన తొలి టెస్టుకు ఆయన ఎంపిక కాలేదు, దీంతో విమర్శలు వెల్లివియడంతో.. ఆయన కూడా కాసింత ఘాటుగానే వ్యాఖ్యానించాడు. జాతీయ జట్టుకు ఎంపిక కానంత మాత్రన తాను ఒడినట్టు కాదు.. తన సహచరులు గెలిచినట్లు కాదని కూడా వ్యాఖ్యానించాడు. అది కాస్తా రాజుకుని ఏకంగా బిసిసిఐ కెప్టెన్, కోచ్ లపై విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఆయనను ఎంపిక చేశామని పిలుపు రావడంతో నిత్యం గంభీరంగా వుండే గౌతముడు కాస్తా చల్లించపోయాడు. దాదాపు రెండేళ్ల తరువాత తనకు తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కడంపై స్టైలిష్ క్రికెటర్ గౌతమ్ గంభీర్, తన మనసులోని భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ గాయపడటంతో, గంభీర్ కు పిలుపురాగా, ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ 34 ఏళ్ల ఢిల్లీ బ్యాట్స్ మెన్, తనకిప్పుడు తొలి మ్యాచ్ అవకాశాన్ని పొందినట్టుగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతూ, ఎంత అనుభవమున్నా, కొంత భయంగా, ఇంకొంత ఆందోళనగా ఉందని అన్నాడు.

ఎన్నో ఆశలతో ఈడెన్ గార్డెన్స్ కు వెళుతున్నట్టు తెలిపాడు. ఇక దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా తనకు మరేదీ ఎక్కవ కాదని, అది టెస్టు క్రికెట్ అయినా, తెలుపు లేదా ఎరుపు బాల్ అయినా ఒకటేనని అన్నాడు. ఇండియా క్యాప్ ధరించే అవకాశం తనకు మరోసారి ఇచ్చిన బీసీసీఐకి కతజ్ఞతలు చెప్పాడు. ఇటీవలి దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీలు చేసి సత్తా చాటిన గంభీర్ కు న్యూజిలాండ్ తో కోల్ కతాలో జరిగే రెండో టెస్టుకు పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2014లో టెస్టు మ్యాచ్ ఆడిన గంభీర్ కు, నాటి పేలవ ప్రదర్శన కారణంగా మరోసారి చోటు లభించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Gambhir  KL Rahul  India vs New Zealand  Eden Gardens india  new zealand  Team India  cricket  

Other Articles