బిసీసీఐ డ్రీమ్ టీమ్ లో యూవీ.. గంగూలీ, కోహ్లీ నో ప్లేస్ Sourav Ganguly fans blast BCCI's Dream Team

Yuvraj singh in india s dream test xi no virat kohli sourav ganguly

india vs new zealand,india vs new zealand score, india vs new zealand match, india, india tests, india tests dream team, india dream team cricket, india dream team, sourav ganguly, ganguly, ganguly india tests, cricket, cricket news, sports, sports news

BCCI asked fans to vote for their all-time Dream Team for Tests as India played their 500th match in Kanpur against New Zealand.

బిసీసీఐ డ్రీమ్ టీమ్ లో యూవీ.. గంగూలీ, కోహ్లీ నో ప్లేస్

Posted: 09/27/2016 06:31 PM IST
Yuvraj singh in india s dream test xi no virat kohli sourav ganguly

భారత క్రికెట్ జట్టు ఆడిన 500వ చారిత్రక మ్యాచ్ పూర్తి చేసుకుని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో టీమిండియాకు చెందిన ఇద్దరు కీలక అటగాళ్లను విస్మరించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ప్రసత్తం టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీతో పాటుగా, ధోని కన్న ముందు టీమిండియాకు సేవలందించిన సౌరవ్ గంగూలీని కూడా విస్మరించడం అభిమానులను అగ్రహానికి గురిచేసింది, ముఖ్యంగా గంగూలీ అభిమానులు బిసిసిఐ తీరుపై మండిపడుతున్నారు.

టెస్టు యావరేజ్లో విరాట్ మెరుగ్గా ఉన్నా స్థానం దక్కకపోవడంపై పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో యువరాజ్ సింగ్ కు 12వ ఆటగాడిగా స్థానం కల్పించారు. ఇక్కడ యువరాజ్ కంటే కోహ్లి సగటు బాగుండటమే చర్చకు దారి తీసింది. 2012లో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్  ఈ ఫార్మాట్లో  33.92 యావరేజ్ తో ఉండగా, విరాట్ కోహ్లి టెస్టు యావరేజ్ 45.06 గా ఉంది. దాంతో పాటు ఈ టీమ్లో భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీకి కూడా చోటు లభించలేదు. భారత జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీ తన టెస్టు కెరీర్లో 116 మ్యాచ్లు ఆడటంతో పాటు 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని టెస్టు యావరేజ్ 42.17 గా ఉంది. దాంతో పాటు 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

గతవారం డ్రీమ్ టెస్టు జట్టును ప్రకటించిన భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ).. తాజాగా వారికి ఓటింగ్ను నిర్వహించింది. ఈ మేరకు భారత డ్రీమ్ టెస్టు ఎలెవన్ కు నిర్వహించిన క్రికెట్ అభిమానలు ఓటింగ్లో రాహుల్ ద్రవిడ్  అత్యధికంగా 96శాతాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత స్థానాల్లో అనిల్ కుంబ్లే(92శాతం), కపిల్ దేవ్(91 శాతం), ఎంఎస్ ధోని(90శాతం)లు ఉన్నారు. కాగా ఈ ఓటింగ్ లో సచిన్ టెండూల్కర్కు 73 శాతం ఓటింగ్ రాగా, వీరేంద్ర సెహ్వాగ్ 86 శాతం సాధించాడు.  అయితే స్టైలిష్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ 58 శాతం ఓటింగ్తో  12వ ఆటగాడిగా ఎంపికైన యువరాజ్ సింగ్(62శాతం) కంటే వెనుక ఉండటం గమనార్హం.

భారత జట్టు అత్యుత్తమ డ్రీమ్ టెస్టు జట్టు ఇది: ఎంఎస్ ధోని(కెప్టెన్), సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ, కపిల్ దేవ్, రవి చంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్(12వ ఆటగాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bcci dream team  saurav ganguly  yuvraj singh  500th test match  cricket  

Other Articles