కివీస్ పై పైచేయి సాధించింది అక్కడే.. Knew they couldn't defend all day, says Kohli

Knew they couldn t defend all day says kohli

ravichandran ashwin, virat kohli, india vs new zealand,india vs new zealand score, india vs new zealand match, india vs new zealand kanpur, india vs new zealand match updates, virart kohli, india vs new zealand match latest news, india, cricket, cricket news, sports, sports news

Virat Kohli, the Indian Test captain, said he was confident of achieving victory on the fifth day of the first Test against New Zealand in Kanpur.

కివీస్ పై పైచేయి సాధించింది అక్కడే..

Posted: 09/26/2016 09:03 PM IST
Knew they couldn t defend all day says kohli

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించడానికి  తమ జట్టులోని ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరచడమే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసించాడు. ఈ మేరకు జట్టు విజయంలో బౌలర్లు ఆకట్టుకోవడం ఒకటైతే, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ మరింత మెరుగు కావడమే తమ విజయానికి ప్రధాన కారణమన్నాడు. న్యూజిలాండ్పై మానసికంగా పైచేయి సాధించడానికి లోయర్ ఆర్డర్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమేనన్నాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. తమ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ పై  సంతృప్తి వ్యక్తం చేశాడు. 'టెస్టు క్రికెట్లో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ అనేది ఎప్పుడూ ప్రధాన భూమిక పోషిస్తుంది. అశ్విన్తో పాటు మిగతా ఆటగాళ్లంతా వారి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఈ రకమైన ఆట తీరు చాలా అవసరం. రెండో ఇన్నింగ్స్లో 300 పరుగులకు మమ్మల్ని ఆలౌట్ చేయొచ్చని కివీస్ భావించింది.

అయితే మేము మరిన్ని పరుగులు సాధించి డిక్లేర్ చేయడంతో న్యూజిలాండ్ను మానసికంగా వెనక్కునెట్టాం. ప్రత్యేకంగా విదేశాల్లో ఆడేటప్పుడు 40నుంచి 50 పరుగులే గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత ఆట తీరుతో లోయర్ ఆర్డర్లో మేము బాగా మెరుగుపడ్డాం' అని  కోహ్లి పేర్కొన్నాడు.మ్యాచ్ ఆరంభంలో కొన్ని పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోయినా, తమ జట్టు తిరిగి పుంజుకున్న తీరు అసాధారణమని కోహ్లి కొనియాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravichandran ashwin  Team India  Kanpur Test Match  500th test match  cricket  

Other Articles