పలు రికార్డులు నమోదు చేసిన చారిత్రాత్మక టెస్టు kanpur test match creates record

Kanpur test match creates record

india vs new zealand,india vs new zealand score, india vs new zealand match, india vs new zealand kanpur, india vs new zealand match updates, virart kohli, india vs new zealand match latest news, india, cricket, cricket news, sports, sports news

A dominating victory made sweeter as it came in India's 500th Test match. Incidentally, India had lost their 100th and 200th Test match but were on the winning side in 300th and 400th Test.

పలు రికార్డులు నమోదు చేసిన చారిత్రాత్మక టెస్టు

Posted: 09/26/2016 07:56 PM IST
Kanpur test match creates record

భారత క్రికెట్ జట్టు ఆడిన 500వ చారిత్రక మ్యాచ్ లో అరుదైన చరిత్ర లిఖించింది. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా సాగిన టెస్టు మ్యాచ్ లో ఏకంగా పది అర్థశతాకాలు నమోదు కావడం సరికొత్త రికార్డుకు బీజం వేసింది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులోనే ఈ రికార్డు సొంతం కావడంతో మున్ముందు మరెన్ని రికార్డులు బద్దలవుతాయోనన్న ఉత్కంఠ కూడా అభిమానుల్లో పెరిగింది. ఒక మ్యాచ్లో కనీసం ఒక్క సెంచరీ కూడా లేకుండా పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం టెస్టు చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.

ఈ మ్యాచ్ భారత తొలి ఇన్నింగ్స్లో మురళీ విజయ(65), చటేశ్వర పూజారా(62)లు హాఫ్ సెంచరీలు చేయగా, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో లాథమ్(58), విలియమ్సన్(75)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇరు జట్ల రెండో ఇన్నింగ్స్ లో మురళీ విజయ్(76),పూజారా(78), రోహిత్ శర్మ(68 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్), ల్యూక్ రోంచీ(80), సాంట్నార్(71)లు హాఫ్ సెంచరీలు సాధించారు. దాంతో మొత్తం సెంచరీ లేకుండా పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ హైలైట్స్:

* టీమిండియా 197 పరుగులతో ఘన విజయం
* చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ లో భారత్ గెలుపు
* 28 ఏళ్ల రికార్డును తిరగరాసిన సాంట్నార్. ఐదు వికెట్లు, 50కు పైగా పరుగులతో రాణించిన సాంట్నార్.
* భారత్ లో జరిగిన టెస్టు మ్యాచులో న్యూజీలాండ్ అటగాడు రాణించడం 1988 తరువాత ఇదే తొలిసారి.
* 1988-89 సీజన్లో జాన్ బ్రాస్ వెల్ ఐదు వికెట్లు, 50కి పైగా పరుగుల ఘనతను నమోదు చేశాడు.
* న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లను ఏడు పరుగుల వ్యవధిలో కోల్పోవడం ఆ జట్టుకు రెండో అత్యల్పం.
* 1992-93 సీజన్లో న్యూజిలాండ్ చివరిసారి ఐదు పరుగులకు ఐదు వికెట్లను నష్టపోయింది.
* తన కెరీర్ లో రెండో టెస్టు ఆడుతున్న ల్యూక్ రోంచీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravichandran ashwin  Team India  Kanpur Test Match  500th test match  cricket  

Other Articles