విజయోస్తు.. దిగ్విజయోస్తూ.. చారిత్రాత్మక టెస్టు భారత్ వశమస్తు.. Jadeja and Ashwin scripted India's victory in 500th Test

India thump new zealand to celebrate 500th test in style

india vs new zealand,india vs new zealand score, india vs new zealand match, india vs new zealand kanpur, india vs new zealand match updates, virart kohli, india vs new zealand match latest news, india, india vs new zealand, india new zealand tests, india new zealand kanpur, cricket, cricket news, sports, sports news

A rampant India beat New Zealand by 197 runs on the 5th and last day of the Kanpur Test after overcoming stiff resistance in the morning especially by Luke Ronchi and Mitch Santner, both of whom scored their respective 50s.

విజయోస్తు.. దిగ్విజయోస్తూ.. చారిత్రాత్మక టెస్టు భారత్ వశమస్తు..

Posted: 09/26/2016 06:01 PM IST
India thump new zealand to celebrate 500th test in style

టీమిండియా ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ప్రారంభం నుంచి అధిపత్యం వహించినట్లు కనిపించిన కివీస్ నుంచి భారత్ లాగేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి న్యూజీలాండ్ బ్యాటింగ్ నుంచి చక్రం తిప్పని స్పీనర్లు.. రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా అధిపత్యం వహించి.. చారిత్రాత్మక మ్యాచ్ లో విజయాన్ని సాధించారు. ఈ నెల 22న కాన్పూరులో ప్రారంభమైన చారిత్రాత్మకమైన మ్యాచ్లో టీమిండియా విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయాన్ని మలుపు తిప్పింది మాత్రం భారత స్పిన్నర్లే. కాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రెండో ఇన్నింగ్స్ లో టెయిలెండర్లు రాణించడం వల్లే విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.

చివరి రోజున మ్యాచ్ ను డ్రా చేసేందుకు కివీస్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరు వికెట్లు చేతిలో వుండటంతో తమ వికెట్లను కాపాడుకుంటూ నిదానంగా బ్యాటింగ్ చేసి డ్రా చేద్దామనుకుంటున్న న్యూజీలాండ్ అశలన్నింటినీ భారత్ బౌలర్లు దెబ్బతీశారు. ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా, భారత్ 'చారిత్రక' విజయం సాధించింది.

434 పరుగుల లక్ష్యంగా 93/4 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే తడబడింది. కివీస్ టాపార్డర్ ఆటగాడు ల్యూక్ రోంచీ(80; 120 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. రోంచీ నిలకడగా ఆడుతున్న సమయంలో రవీంద్ర జడేజా వేసిన చక్కటి బంతికి బోల్తా పడ్డాడు. ఆ తరువాత వాట్లింగ్(18), క్రెయిగ్(1)లను భారత ప్రధాన ఆయుధం మొహ్మద్ షమీ చేతికి చిక్కారు. వాట్లింగ్ ను ఎల్బీడబ్యూగా పెవిలియన్ కు పంపగా, ఆ తరువాతి ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ బౌల్డ్ అయ్యాడు.

కాగా, తమ జట్టు గెలుపు ఒంటరిపోరాటం చేసిన సాంట్నార్(71) బాధ్యతాయుతంగా ఆడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. సాంట్నార్ ఎనిమిదో వికెట్ గా అవుటైన తరువాత మిగిలిన ఇద్దరి ఆటగాళ్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. దాంతో కివీస్ 236 పరుగులకే చాపచుట్టేయడంతో భారత్కు 197 పరుగుల భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించి కివీస్ ఇన్నింగ్స్ ను చెల్లాచెదురు చేయగా, షమీకి రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Kanpur Test Match  500th test match  cricket  

Other Articles