Andre Russell Weds Long-Time Girlfriend Jassym Lora

West indies cricketer andre russell ties the knot

andre russell, wedding, Girlfriend, Jassym Lora, west indies all rounder, Kolkata Knight Riders,West Indies Cricket Team,Andre Russell, Long-Time Girlfriend Jassym Lora, Cricket latest Cricket news

West Indies all-rounder Andre Russell started a new innings in his life after marrying long-time girlfriend Jassym Lora. The 28-year-old posted pictures of his marriage on Instagram

చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న క్రీకెటర్

Posted: 07/30/2016 08:45 PM IST
West indies cricketer andre russell ties the knot

చిన్నప్పుడు తల్లి ఎంత వారించినా గ్రౌండ్ వైపు పరుగులు తీశాడు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా క్రికెట్ బ్యాట్ పట్టాడు. మైదానాన్నే సర్వస్వంగా భావించాడు. తనవైన టెక్నిక్స్ తో ఆటలో రాణించాడు. డొమెస్టిక్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. సమకాలీన క్రికెట్ చరిత్రలో అరివీరభయంకరుడు అనదగ్గ ఆల్ రౌండర్లలో ఒకరైన జమైకన్ పుత్రుడు ఆండ్రీ రస్సెల్.. తన జీవితంలో చోటుచేసుకున్న అన్ని మలుపులకూ దేవుడే కారణం అంటాడు. తన వివాహవేడుకలోనూ ఇదే చెప్పాడు.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన గర్ల్ ఫ్రెండ్ జాసిమ్ లోరాను శుక్రవారం పెళ్లిచేసుకున్నాడు. డోమినికన్ రిపబ్లిక్ కు చెందిన జాసిమ్ మోడల్ గా కొనసాగుతోంది. చాలా ఏళ్ల కిందటే వీరిమధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి 2014లో నిశ్చితార్థానికి దారితీసింది. ఇప్పుడు పెళ్లితో శుభంకార్డు పడినట్లైంది. 'ఏ విషయంలోనైనా దేవుణ్ని ముందుంచుకోవాలి.. ఆయనే దారి చూపిస్తాడు'అని ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లిఫొటోతోపాటు కామెంట్ పెట్టాడు రస్సెల్. కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ విండీస్ క్రికెటర్ కు ఆటలో ఎదురైన విఘ్నాలను కూడా దేవుడే తొలిగించాలని కోరుకుందాం! ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రస్సెల్ కు ఆ జట్టు యాజమాన్యం వివాహ శుభాకాంక్షలు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andre russell  wedding  Girlfriend  Jassym Lora  west indies all rounder  

Other Articles