Murali Vijay misses Kingston test with injury, KL Rahul to replace him

Batsmen need to take responsibility on bouncy track advices virat kohli

kohli inida windies series, kohli inida windies series news, kohli inida windies series latest news, kohli inida windies series batsmen, kohli inida windies series batting, cricket, cricket, sports news, sports

Indian skipper Virat Kohli has said that his batsmen will have to take more responsibility on a "result-oriented" green wicket laid out for the second Test against the West Indies

టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు.. వారితో కాస్త జాగ్రత్తా..

Posted: 07/30/2016 05:31 PM IST
Batsmen need to take responsibility on bouncy track advices virat kohli

ఇవాళ్టి నుంచి అతిథ్య జట్టు వెస్టిండీస్‌తో కింగ్ స్టన్ వేదికగా ప్రారంభంకానున్న రెండో టెస్టులో టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు కాసింత జాగ్రత్తగా వుండాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని సూచనలు చేశాడు. బౌన్సీ పిచ్ లపై టాపార్డర్ ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలని, ఇక్కడి మైదానంలో కచ్చితంగా ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. ఎందుకంటే రెండో టెస్టుకు వేదికైన సబీనా పార్క్‌లో ఫాస్ట్ పిచ్ ఎదురుచూస్తోంది. గాయపడ్డ మురళీ విజయ్ స్థానంలో లోకేష్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడని, అతడిపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని తెలిపాడు. అవసరమైతే కీపింగ్ చేయగలడం అతడికి మరో ప్లస్ పాయింట్ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన రాహుల్ జింబాబ్వే పర్యటనలో రాణించాడని, అతడికిదే సదావకాశమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తొలిటెస్టు పరాభవం నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న విండీస్ పాస్ట్ పిచ్ లపై యువ బౌలింగ్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. 19 ఏళ్ల అల్జారీ జోసెఫ్, 25 ఏళ్ల మిగుయెల్ కుమిన్స్‌లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో సిరీస్ లో ఈ మ్యాచ్ విజయంతో 2-0 ఆధిక్యం దక్కాలంటే టాపార్డర్ తో పాటు, పేస్ బౌలర్లు విజృంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 2008 తర్వాత ఇక్కడ ఏ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరగలేదని, 2011లో భారత్ కూడా తన మ్యాచ్‌ను 4 రోజుల్లోనే నెగ్గిన విషయాన్ని భారత సహచర ఆటగాళ్లకు కోహ్లీ గుర్తుచేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat Kohli  lokesh rahul  India vs West Indies 2016  Second Test  Test series  BCCI  cricket  

Other Articles