With KL Rahul waiting in wings, 'Not worried about my form', says Cheteshwar Pujara

Kumble happy with my batting form says cheteshwar pujara

Cheteshwar Pujara, Cheteshwar Pujara india, india Cheteshwar Pujara, india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, fifa video game, shikar dhawan, Test series, cricket, sports news, sports

Cheteshwar Pujara remained confident ahead of the second Test against West Indies despite not being in the best of batting forms in the recent past.

రెండో టెస్టులో బాగా రాణిస్తాను: చత్తీశ్వర్ పుజారా

Posted: 07/29/2016 06:01 PM IST
Kumble happy with my batting form says cheteshwar pujara

తన ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా అంటున్నాడు. గత కొన్ని మ్యాచులలో తన బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రాలేదన్నది వాస్తవమేనని... కఠిన పరిస్థితుల్లోనూ తాను సెంచరీ, డబుల్ సెంచరీలు చేశానని గుర్తు చేశాడు. అలా అని ఎప్పుడూ ఆలాంటి ఆట ఆశించడం అభిమానులకు అలవాటైనా.. అలాంటి ఆటను ఆడటం క్రిడాకారులకు సాధ్యం కాదని అన్నారు.  హాఫ్ సెంచరీ చేసి ఆరు ఇన్నింగ్స్ లు అయిందన్న విషయం తనకు తెలుసునన్నాడు. జట్టు విజయాలలో తనవంతు పాత్ర పోషిస్తున్నానని, తన ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదన్నాడు.

అయితే జట్టులో బ్యాట్స్ మెన్ల ముఖ్యమైన పాత్ర ఇతర ఆటగాళ్లతో కలిసి స్ట్రైక్ రొటేట్ చేయడమని, దానిని తాను చేస్తూ భాగస్వామ్యాలలో పాలుపంచుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. దక్షిణాఫ్రికా లాంటి చాలెంజింగ్ వికెట్ పిచ్ లలో తాను రాణించానని, భారీ స్కోర్లు చేశానని వ్యాఖ్యానించాడు. 'గత టెస్ట్ మ్యాచ్ లో మంచి సమయంలో చెత్త షాట్ ఆడి అవుటయ్యాను. తొలి సెషన్లో బంతి చాలా మందకొడిగా వస్తుంటే ఆడటం కష్టం' అని పుజారా పేర్కొన్నాడు. తన బ్యాటింగ్ లోపాలపై కోచ్ అనిల్ కుంబ్లేతో చర్చించానని, విండీస్ ను వైట్ వాష్ చేయడమే ప్రస్తుతం టీమిండియా ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheteshwar Pujara  India vs West Indies 2016  Team india  Test series  BCCI  cricket  

Other Articles