We were playing a tough catch-up game throughout says Holder

We failed to execute our plans says jason holder

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, Carlos Brathwaite, Jason Holder, Test series, cricket, sports news, sports

West Indies’ captain Jason Holder admitted both he and fellow all-rounder Brathwaite, who have done better as lower order batsmen, must start by taking wickets consistently in Test cricket.

పోరాట పటిమలేమితోనే అంటిగ్వా టెస్టులో ఓటమి

Posted: 07/26/2016 02:37 PM IST
We failed to execute our plans says jason holder

టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో తమ జట్టు ఘోరంగా వైఫల్యానికి కారణం అనుభవ రాహిత్యమైన క్రీడాకారులు ఒక కారణమైతే.. తమ క్రీడాకారుల పేలవ ప్రదర్శన కూడా మరో కారణమని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. తమ జట్టులో పోరాట పటిమ లేకుండా పోవడమే ఇందుకు కారణమని అన్నాడు. ఓటమిని ఓ వైపు ఉంచితే, అసలు పోరాటం అనేదే కనబరచకుండా వెనుదిరగడం తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ పరాజయానికి ప్రధాన కారణం బౌలింగ్లో పూర్తిగా వైఫల్యం చెందడమేనన్నాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో కట్టడి చేసివుంటే.. ఇలాంటి ఫలితం వచ్చేది కాదన్నాడు.
 
'టీమిండియాకు ముందే లొంగిపోయాం. అసలు తొలి ఇన్నింగ్స్లో మా బౌలింగ్ సరిగా లేదు.  దాంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. అసలు ప్రత్యర్థి జట్టుపై ఎటువంటి ఒత్తిడి తేలేకపోయాం. ఓ మోస్తరుగా మాత్రమే బౌలింగ్లో రాణించాం. ఇది టెస్టు క్రికెట్ లో సరిపోదు. సుదీర్ఘమైన టెస్టు మ్యాచ్లో బౌలింగ్ అనేది చాలా కీలకం. మా బౌలింగ్ చాలా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు రెండు సెంచరీలు చేసే అవకాశం ఇవ్వడం మా బౌలింగ్లో పసలేకపోవడాన్ని సూచిస్తుంది. తదుపరి మ్యాచ్ నాటికి భారత్ జట్టుకు గట్టి పోటీ ఇస్తామని భావిస్తున్నా'అని హోల్డర్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jason Holder  west indies  Carlos Brathwaite  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles