Kohli-Kumble partnership starts off on emphatic note

India demolish wi by an innings and 92 runs

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, Ravichandran Ashwin, india, virat kohli, anil kumble, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

Ravichandran Ashwin's second-best career figures of 7 for 83 ensured India took a 1-0 lead in the four-match series with an emphatic victory by an innings and 92 runs.

అంటిగ్వా టెస్టులో టీమిండియా బోణి.. అ‘స్పీన్’ మాయాజాలం..

Posted: 07/25/2016 10:51 AM IST
India demolish wi by an innings and 92 runs

వెస్టిండీస్ పర్యటనలో నాలుగు టెస్టు సిరీస్ లలో భాగంగా అటింగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్లతో పాట, టీమిండియా బౌలర్లు కూడా తమ సత్తాను చాటారు. ఫలితంగా తొలి మ్యాచ్ ను తమ ఖాతాలోకి వేసుకున్నారు. ఆతిథ్య వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఉమేష్‌ (4/41), షమి (4/66), మిశ్రా (2/43) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే వెస్టీండీస్ కుప్పకూలింది.

భారత్ తొలిఇన్నింగ్స్ లో సాధించిన స్కోరులో సగం కూడా చేయలేని స్థితిలో ఫాలో అన్ గండం ఎదురైంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్టిండిస్ ను స్పిన్నర్లు అమాంతం కూల్చేశారు. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (7/83) మ్యాజిక్‌ చేయడంతో కరీబియన్‌ జట్టు 231 పరుగులకే చేతులెత్తేసింది. మార్లోన్‌ శామ్యూల్స్‌ (50) రాణించాడు. 132కే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో కార్లోస్‌ బ్రాతవైట్‌ (51 నాటౌట్‌), దేవేంద్ర బిషూ (45) రాణించినా విండీస్‌ను ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించలేకపోయారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 21/1తో విండీస్‌ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగింది.

తొలి ఇన్నింగ్స్‌ను 566/8 వద్ద డిక్లేర్‌ చేసిన టీమిండియాను ఇన్నింగ్స్ 92 పరుగులతో విజయతీరాలకు చేర్చింది బౌలర్లే. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్‌ స్పిన్ మాయాజాలం రక్తికట్టి విండీస్ అటకట్టించింది. ఉదయం సెషన్‌ తొలి ఓవర్లోనే డారెన్‌ బ్రావోను అవుట్‌ చేసిన ఉమేష్‌ విండీస్‌ పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత అశ్విన్‌ మాయాజాలం మొదలైంది. చంద్రిక (31), బ్లాక్‌వుడ్‌ (0), శామ్యూల్స్‌ (50), ఛేజ్‌ (8), హోల్డర్‌ (16)లను అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చాడు.

దీంతో 132 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను బ్రాతవైట్‌, బిషూ ఆదుకునే ప్రయత్నం చేశారు. తొమ్మిదో వికెట్‌కు 95 రన్స్‌ జోడించారు. చివర్లో బిషూ, గాబ్రియెల్‌ కూడా అశ్విన్‌కే చిక్కడంతో భారతకు విజయం దక్కింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 25 ఓవర్లలో 7 వికెట్లు తీసుకోగా, ఉమేష్‌ 13 ఓవర్లలో 4 వికెట్లు, షమి 10 ఓవర్లలో 3 వికెట్లు, అమిత్ మిశ్రా 19 ఓవర్లలో 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 ఓవర్లలో రెండు వికెట్లతో రాణించారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మొత్తం 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్‌.
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 90.2 ఓవర్లలో 243 ఆలౌట్‌.
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ : 78 ఓవర్లలో  231 ఆలౌట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  india  virat kohli  anil kumble  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles