Indian team meets Sir Vivian Richards at Antigua ahead of 1st Test against West Indies

Kohli and co receives words of gold from viv richards

india west indies first test, indian team at antigua, indian team meets sir viv richards, indian play west indies first test match antigua, sir vivian richards, virat kohli, ajinkya rahane, stuart binny, Anil Kumble, india vs west indies, India vs West Indies Test Series, west indies cricket, West Indies, india, BCCI, cricket, cricket news

Virat Kohli, Shikhar Dhawan, Murali Vijay, Stuart Binny and Ajinkya Rahane were all seen having a discussion with the West Indian great, ahead of their first test at Sir Vivian Richards Stadium, North Sound, Antigua

కోహ్లీ సేనకు ‘సర్’ ప్రైజ్.. రిచర్డ్స్ అల్ ది బెస్ట్

Posted: 07/19/2016 03:08 PM IST
Kohli and co receives words of gold from viv richards

వెస్డిండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేన.. ఈ నెల 21 నుంచి అతిధ్య జట్టుతో వారి సొంత గ్రౌండ్ లో తొలిటెస్టులో తలపడనున్న నేపథ్యంలో బిజీబిజీగా వున్నారు. గ్రౌండ్ లో కోత్త కోచ్ నేతృత్వంలో కఠోర శిక్షణ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు ఒకనాటి లెజెండ్ అల్ రౌండర్. అయన మరెవర కాదు వెస్డిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్. తమను కలిసేందుకు స్వయంగా రిచర్డ్స్ లాంటి దిగ్గజ ఆటగాడు రావడంతో భారత క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను ఆయన స్వయంగా వచ్చి కలవడంతో పాటు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఆయన చెప్పిన పలు సూచనలను కోహ్లీ సేన శ్రద్దగా విన్నది. ఈ సందర్భంగా విండీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా ఆటగాళ్లకు రిఛర్డ్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమతో విలువైన సమయాన్ని కేటాయించిన విండీస్ మాజీ ఆటగాడికి కోహ్లీ, రహానే, మురళీ విజయ్, రాహుల్, ధావన్, స్టూవర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలను ప్రత్యేకంగా అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీల మోత మోగించిన విరాట్ ను మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. కూల్ గా ఉంటూనే తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే రహానేను ప్రశంసించాడు. స్టూవర్ట్ బిన్నీతో మాట్లాడుతూ అతడి తండ్రి మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో పాటు 1983 ప్రపంచకప్ రోజులను రిచర్డ్స్ గుర్తుచేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  west indies  sir vivian richards  virat kohli  ajinkya rahane  stuart binny  Team india  BCCI  cricket  

Other Articles