Improved fitness has helped me become a better fielder, says Virat Kohli

India test captain virat kohli shares his fitness mantra

India Test captain,Virat Kohli,Virat Kohli shares his fitness mantra,Virat Kohli fitness,India Test captain Virat Kohli,Kohli gym session, Fielding, fitness, India, Indian Cricket Team, Indian Premier League, IPL, IPL 2012, cricket news, cricket

India's Test captain Virat Kohli says his whole outlook towards fitness changed after IPL 2012 and a healthier body has not only made him a better batsman but also an improved fielder.

ఫిట్ నెస్ రహస్యాన్ని వివరించిన విరాట్ కోహ్లీ..

Posted: 06/28/2016 07:37 PM IST
India test captain virat kohli shares his fitness mantra

బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణించడానికి కారణం ఫిట్ నెస్సేనని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కెరీర్ ఆరంభంలో ఫిట్ నెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నాడు. దీంతో తన పూర్తి సామర్థ్యం ప్రదర్శించలేకపోయానని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 2012 ఐపీఎల్ తరువాత ఫిట్ నెస్ ప్రాధాన్యత గుర్తించానని చెప్పాడు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ తయారు చేసుకుంటున్ననని చెప్పాడు. ఏం తినాలి?, ఎంత వర్కవుట్ చేయాలి?, ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి? వంటి విషయాలన్నీ క్రమబద్దంగా పాటిస్తున్నానని అన్నాడు. ఆ తరువాత పూర్తి సామర్థ్యంలో ఆడగలుగుతున్నానని, మంచి బ్యాట్సమన్, ఫీల్డర్ వంటి కితాబులందుకుంటున్నానని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ ను సంతరించుకోవాలనుకుంటే క్రమ శిక్షణ పాటించాలని సూచించాడు.

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వన్డేల్లో తన రెండో ర్యాంకును నిలుపుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ 813 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలవగా,  శిఖర్ ధవన్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలాఉండగా, దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స 887 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా, ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ హషీమ్ ఆమ్లా  778 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.
 
ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ మొదటి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో,  బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ హకిబుల్ హసన్ మూడో స్థానంలో నిలిచారు.  కాగా, బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఏ ఒక్క భారత ఆటగాడు టాప్-10లో నిలవకపోవడం గమనార్హం. ఇక జట్ల విషయానికొస్తే ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆల్ రౌండర్ల కోటాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హసనల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india  BCCI  ICC  ODI Rankings  Fitness  Fielding  Shikar Dhawan  cricket  

Other Articles