AB de Villiers one day international low

Ab de villiers odi poorest batting average

West Indies, tri-series, South Africa, AB de Villiers, ab de villers poorest record, Australia, cricket, west indies vs south africa, wi vs sa, wi vs sa, west indies vs south africa, wi vs south africa score, wi vs sa odi match, west indies vs south africa score, west indies vs south africa score, west indies vs south africa

AB de Villiers' batting average in the tournament, his poorest since 2010-11 in an ODI series/tournament in which he batted more than twice.

ఏబీ డివిలియర్స్ పేరున చెత్త రికార్డు నమోదు.!

Posted: 06/26/2016 12:48 PM IST
Ab de villiers odi poorest batting average

మూడు అగ్రశేణి జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో అతిధ్య జట్ల వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డారెన్ బ్రావో (102) సెంచరీ, పొలార్డ్ (62) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు బౌలర్లు సక్సెస్ కావడంతో విండీస్ 100 పరుగులతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సఫారీ జట్టుకు చెందిన విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. వన్డే సిరీస్లో రెండు కంటే ఎక్కువ ఇన్నింగ్స్ లలో ఏబీ బ్యాటింగ్ చేసిన సందర్భాలలో అతి తక్కువ బ్యాటింగ్ సగటు ఈ ట్రై సిరీస్లో 24.2 నమోదైంది.

ఈ సిరీస్ లో అతని వ్యక్తిగత అత్యదిక స్కోరు 39 పరుగులు కాగా తాజాగా విండీస్ తో మ్యాచ్ లోనూ 2 పరుగులు చేసి ఏబీ నిరాశపరిచాడు. దాదాపు అయిదారేళ్ల కిందట మాత్రమే డివిలియర్స్ ఇంతకన్నా తక్కువ బ్యాటింగ్ సగటును సాధించాడు. రెండో అతి తక్కువ సగటుతో చెత్త రికార్డు ఏబీ ఖాతాలో పడింది.  2010-11లో భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన డివిలియర్స్ 22.80 సగటుతో 114 పరుగులు మాత్రమే చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 49.5 ఓవర్లలో 285 పరుగులు చేయగా, టార్గెట్ ఛేదనకు దిగిన సఫారీలు విండీస్ బౌలర్ల దాటికి తట్టుకోలేక 46 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Indies  tri-series  South Africa  AB de Villiers  Australia  cricket  

Other Articles