It's Virat Kohli versus David Warner in IPL final

Warner targets kohli in ipl final to defuse rcb s batting

ipl 2016, cricket, david warner, yuvraj singh, sunrisers hyderabad, Bipul Sharma, david warner, Gujarat Lions, Brendon McCullum, virat kohli, raoyal chanllengers banglore. srh vs rcb, warner vs kohli, banglore hyderabad, rec vs srh

David Warner did a Virat Kohli today in a must-win game by playing a captain's knock for his team and leading Sunrisers Hyderabad to their maiden IPL final.

కోహ్లీకి హెచ్చరికలు జారీ చేసిన వార్నర్..

Posted: 05/28/2016 07:11 PM IST
Warner targets kohli in ipl final to defuse rcb s batting

ప్లే అఫ్ కు చేరిన తొలి జట్టుగా తమ అగమనాన్ని నమోదు చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. తప్పని సరి దశకు చేరి కోల్ కతా నైట్ రేడర్స్ ను ఎలిమినేట్ రౌండ్లో చావబాది, గుజరాత్ లయన్స్ తో క్వాలిఫయర్ 2లో తలపడి మట్టికరిపించింది. అదే జోరుతో ఇక తుది సమరానికి చేరింది. ఈ తుదిపోరులో సమర్థమైన గేమ్‌ ప్లాన్‌తో ఫైనల్‌కు సిద్ధమవుతున్నామని, తమ టార్గెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమేనని అన్నాడు సన్ రేజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.

'బెంగళూరుతో చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో చాలా బాగా పుంజుకున్నాం. విరాట్‌ కోహ్లి నిజానికి అద్భుతమైన ఆటగాడు. అతనే మా టార్గెట్ అని చెప్పాడు. మేం అతన్ని తర్వగా ఔట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం. కోహ్లి విఫలమైనా డివిలీయర్స్‌ ఉండనే ఉంటాడు. కాబట్టి మేం వాళ్ల జట్టులో ఉన్న ఆటగాళ్ల గురించి పెద్దగా చింతించడం లేదు. వారిని నిలువరించాలంటే సమర్థమైన గేమ్ ప్లాన్‌ కావాలి. దానిని మేం సిద్ధం చేసుకుంటాం' అని వార్నర్‌ అన్నాడు. 'మ్యాచ్‌ ఆసాంతం భాగస్వామ్యాలు కొనసాగేలా చూశాను. మాలో ఏ ఒక్కరూ క్రీజులో ఉన్నా.. మేం గెలుస్తామని భావించాను. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్‌. ఈ (విజయం) క్రెడిట్‌ను నేను తీసుకోను. మేం అందరం శాయశక్తులా కృషి చేసి మా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంది. ఇక బిపుల్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింటిలోనూ సత్తా చాటాడు' అని వార్నర్ పేర్కొన్నాడు.

గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో జట్టు సారథిగా డేవిడ్ వార్నర్‌ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. వార్నర్‌ కడదాక నిలబడి 93 పరుగులు చేయడంతో గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు ఛేదించింది. చివర్లో బిపుల్ శర్మ (27 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో ఘనంగా హైదరాబాద్‌ ఫైనల్‌ లో అడుగుపెట్టింది. ఇక మరికోన్ని గంటల వ్యవధిలో తెరలేవనున్న చివరి ఘట్టానికి ఇరు జట్లు సమరశంఖాన్ని పూరించనున్నాయి. ఇటు డేవిడ్‌ వార్నర్‌, అటు విరాట్ కోహ్లి ఇద్దరూ భీకరమైన ఫామ్‌తో విజృంభిస్తుండటంతో ఫైనల్‌ రసవత్తరంగా జరుగుతుందని క్రికెట్‌ ప్రేమికులు ఆశిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  cricket  david warner  virat kohli  sunrisers hyderabad  royal challengers banglore  

Other Articles