Bangladesh all-rounder Shakib Al Hasan unhappy with IPL performance

Kkr shakib al hasan unhappy with ipl performance

ipl, ipl 9, cricket, shakib al hasan, kolkata knight riders, bangladesh, dhaka, IPL 2016, RCB, indian premier league, ipl 2016

Bangladesh all-rounder Shakib Al Hasan is unhappy with his performance in the Indian Premier League 2016 (IPL 9) for the Kolkata Knight Riders (KKR).

ఐపీఎల్ లో నా ప్రదర్శనలో సంతృప్తికరంగా లేదు..

Posted: 05/28/2016 06:56 PM IST
Kkr shakib al hasan unhappy with ipl performance

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తన ప్రదర్శన అంతా బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు షకీబుల్ హసన్. ఐపీఎల్ లో అత్యంత అద్బుథ ప్రదర్శన ఇద్దామని వచ్చి.. ఇక్కడ ఏమి సాధించలేకపోయానని తన వ్యక్తిగత ప్రదర్శనపై బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్లో తన ఆట తీరు ఏమాత్రం బాలేదని షకిబుల్ పేర్కొన్నాడు. కోల్ కతా జట్టు ప్రదర్శన బాగున్నా, వ్యక్తిగతం తాను ఆకట్టుకోలేకపోవడం బాధించిందన్నాడు.

 'నేను నిజంగా సరిగా ఆడలేకపోయాను. ఇది కాస్త బాధిస్తోంది. ఐపీఎల్లో ఆకట్టుకుని ఉంటే సంతప్తిగా అనిపించేది.  అందుచేత సంతోషంగా లేను. వరుసగా ఆసియాకప్, వరల్డ్ టీ 20, ఐపీఎల్తో విరామం లేకుండా గడిపా.ఈ పరిస్థితుల్లో కొద్ది విశ్రాంతి అవసరం' అని స్వదేశానికి చేరుకున్న షకిబుల్ పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్లో గుజరాత్ లయన్స్పై షకిబుల్ చేసిన 66 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, మొత్తంగా 114 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో 10 మ్యాచ్లకు కలిపి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  indian premier league  ipl 2016  Shakib Al Hasan  kolkata knight riders  

Other Articles