Indian Premier League Sunrisers Hyderabad vs Kolkata Knight Riders

Sunrisers hyderabad face do or die match in eliminator round against kolkata knight riders

Indian Premier League (IPL), Qualifier 2, sun risers hyderabab, Kolkata Knight Riders, david warner, shikar dhawan, gautam gambir, robin uttappa, srh vs kkr, kkr vs sr, ipl 2016

Two-time champions Kolkata Knight Riders would look to assert their supremacy while Sunrisers Hyderabad will have revenge on mind when the two teams clash in the IPL Eliminator

విజయాన్ని అందుకుంటారా.. ఫైనల్స్ లోకి దూసుకెళ్తారా..?

Posted: 05/25/2016 05:53 PM IST
Sunrisers hyderabad face do or die match in eliminator round against kolkata knight riders

ఒక జట్టులో చూస్తే  హిట్టర్లు..చెలరేగితే భారీ స్కోరు ఖాయం. మరో జట్టులో అత్యుత్తమ బౌలర్లు. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో రికార్డు. ఈ రెండు జట్లు ఎలిమినేటర్ రౌండ్లో తలపడటానికి రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం రాత్రి గం.8.00లకు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.  ప్లే ఆఫ్ దశలో జరిగే ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే.

అయితే ఈ మ్యాచ్ లో కోల్ కతానే ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. అంతకుముందు లీగ్ దశలో కోల్ కతా తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ ఓటమి పాలైంది.  ఈ నేపథ్యంలో కోల్ కతాపై సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరో వైపు సన్ రైజర్స్పై 'హ్యాట్రిక్' విజయం సాధించి రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించాలని కోల్ కతా యోచిస్తోంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్ కతా నైట్ రైడర్స్  జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.

ఒకవైపు కోల్ కతా జట్టులో కెప్టెన్ గౌతం గంభీర్తో పాటు రాబిన్ ఉతప్ప, మున్రో, యూసఫ్ పఠాన్, మనీష్ పాండే వంటి స్టార్ ఆటగాళ్లుండగా, మరోవైపు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, విలియమ్సన్ లతో సన్ రైజర్స్ పటిష్టంగా ఉంది. కాగా, లీగ్ దశలో చివరి నాలుగు మ్యాచ్ల్లో మూడింట ఓటమి పాలుకావడం సన్ రైజర్స్ జట్టులో ఆందోళన పెంచుతుంది. దాదాపు కోల్ కతా పరిస్థితి కూడా ఇలానే ఉన్నా కాస్త మెరుగ్గా ఉంది.  మరి కోల్ కతా హ్యాట్రిక్ సాధిస్తుందా?లేక సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా?అనేది మాత్రం ఆసక్తికరమే. ఫిరోజ్ షా కోట్ల మైదానం బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  sun risers hyderabab  Kolkata Knight Riders  cricket  

Other Articles