Virat Kohli gone for 'Zero' against Gujarat Lions

Rcb wilting to excellent bowling

Royal Challengers Bangalore,Virat Kohli,Gujarat Lions, RCB vs GL, Bengaluru, Qualifier 1,IPL 9,Cricket latest IPL 9 news

Dwayne Smith really plugged the wicket for all it was worth, with his dominating and tremendously exciting 41-ball 73.

గుజరాత్ చెత్త రికార్డు.. అదుకున్న ఒకేఒక్కడు..

Posted: 05/24/2016 09:52 PM IST
Rcb wilting to excellent bowling

ఐపీఎల్-9 తొలి దశలో ముగిసి.. ప్లే ఆఫ్ అంకానికి చేరింది. దీంతో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ లయన్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు)  ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ ఐపీఎల్లోని పవర్ ప్లేలో ఆర్సీబీపై  అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
 
అంతకుముందు 2009 లో మాత్రమే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో ఆర్సీబీపై 14 పరుగులు చేసిన తరువాత ఇప్పుడు గుజరాత్ లయన్స్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. మరోవైపు ఓపెనర్లు ఇద్దరూ ఐదు పరుగులు మాత్రమే నమోదు చేసి పెవిలియన్ కు చేరడం ఈ ఐపీఎల్లో గుజరాత్ కు ఇదే ప్రథమం. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఆటగాళ్లు బ్రెండన్ మెకల్లమ్(1), అరోన్ ఫించ్(4) నిరాశపరచగా, కెప్టెన్ సురేష్ రైనా(1) నిష్కమించి తీవ్రంగా నిరాశపరిచారు.

ఆ తరుణంలో దినేష్ కార్తీక్(26; 30 బంతుల్లో 2 ఫోర్లు), డ్వేన్ స్మిత్ (73;41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) జోడి రాణించడంతో గుజరాత్ తేరుకుంది. ఈ జోడి నాల్గో వికెట్ కు 85 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం రవీంద్ర జడేజా(3) ఐదో వికెట్ గా అవుట్ కాగా, ఆరో వికెట్ గా స్మిత్ పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో డ్వేన్ బ్రేవో (8) నిరాశపరిచినా, ద్వివేది(19;9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో  గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులు చేసింది.  ఆర్సీబీ బౌలర్లలో  షేన్ వాట్సన్ నాలుగు వికెట్లు సాధించగా, జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లాలకు తలో రెండు వికెట్లు,  చాహల్ కు ఒక వికెట్ దక్కింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  IPL  Royal Challengers Bangalore  Gujarat Lions  RCB vs GL  Bengaluru  Qualifier 1  cricket  

Other Articles