Hardik photobombs Pollard, wife’s anniversary picture

Hardik photobombs pollard wife s anniversary picture

Indian Premier League (IPL), Mumbai Indians, Hardik Pandya, Kieron Pollard, Instagram, Jenna, marriage anniversary, ipl 2016

The 22-year-old cricketer became a part of what was supposed to be a couple photo to celebrate 11 years of togetherness of Pollard and his wife.

భార్యభర్తల మధ్యలో పాండ్యా..

Posted: 05/24/2016 08:19 PM IST
Hardik photobombs pollard wife s anniversary picture

సహచర ఆటగాడు హార్థిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫొటోలో కనిపించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని అతడు వదులుకోడని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. అందుకు తగిన ఫొటో కూడా పెట్టాడు. తమ పెళ్లై 11 ఏళ్లు పూర్తై సందర్భంగా పొలార్డ్ తన భార్య జెన్నాను అప్యాయంగా కౌలిగించుకున్నాడు. అదే సమయంలో వెనకాల నుంచి పొలార్డ్ ను పాండ్యా ఆలింగనం చేసుకున్నాడు. పానకంలో పుడకలా పాండ్యా తమ మధ్యకు వచ్చినప్పుటికీ జెన్నా ఏమనకుండా నవ్వుతూ ఉండిపోయింది.

ఈ సరదా ఫొటోను పొలార్డ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ఫొటోలో పడేందుకు పాండ్యా ప్రయత్నిస్తుంచాడని సరదా కామెంట్ కూడా పెట్టాడు. పొలార్డ్-జెన్నా దంపతులతో సోదరుడు క్రునాల్ పాండ్యా, తాను కలిసి దిగిన ఫొటోను అంతకుముందు హార్థిక పాండ్యాకు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కాగా, ఐపీఎల్-9లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ కు చేరకపోవడంతో వీరికి తీరిక లభించింది. దానిని ఇలా తమ జీవితంలోని మధురమైన జ్ఞాపకాలను పంచుకునేందుకు సెల్సీలో బిజీగా మారారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  Kieron Pollard  Jenna  marriage anniversary  ipl 2016  

Other Articles