Shaun Marsh latest to be ruled out of Indian Premier League

Kings xi s shaun marsh ruled out of ipl

Murali Vijay, kings xi punjab, Shaun Marsh, David Miller, 2016 IPL, Indian Premier Leagaue, cricket news sports news, sports gallery, cricket news, cricket

Kings XI Punjab batsman Shaun Marsh has been ruled out of the IPL with a back injury.

ఐపీఎల్ కు దూరమైన మరో అసీస్ క్రీకెటర్

Posted: 05/03/2016 05:31 PM IST
Kings xi s shaun marsh ruled out of ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గాయాల బారిన పడుతున్నవిదేశీ క్రికెటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందులోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, జాన్ హాస్టింగ్స్లు ఐపీఎల్కు దూరం కాగా, మరో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. కింగ్స్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్ మార్ష్ వెన్నుముక గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
 
మొన్నటి మ్యాచ్ లో అనూహ్య విజయాన్ని అందుకున్న కింగ్ ఎలవన్ పంజాబ్.. ఇక గాడిలో పడిందనుకుంటున్న తరునంలో షాన్ మార్ష్ జట్టుకు దూరం కావడంతో ఆ లోటును ఎలా అధిగమిస్తుందో చూడాలి. దీంతో గాయాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న విదేశీ ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకుముందు లషిత్ మలింగా(ముంబై ఇండియన్స్), కెవిన్ పీటర్సన్(పుణె సూపర్ జెయింట్స్), డు ప్లెసిస్(పుణె సూపర్ జెయింట్స్), శామ్యూల్ బద్రి(ఆర్సీబీ)లు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ipl 2016  ipl9  murali vijay  Shaun Marsh  IPL  kings XI punjab  

Other Articles